NRI Crime: ఇంట్లో పనికంటూ ఇద్దరు మహిళలను భారత్‌ నుంచి రప్పించి మరీ ఓ ఎన్నారై చేసిన దారుణమిదీ.. 8 ఏళ్లుగా వాళ్లను దాచి..

ABN , First Publish Date - 2023-02-18T16:39:32+05:30 IST

తననే నమ్ముకుని ఇండియా నుంచి వచ్చిన ఇద్దరు మహిళలను ఓ అమెరికా ఎన్నారై దారుణంగా మోసం చేసింది. 8 ఏళ్లుగా వాళ్లను దాచి పెట్టి ఇంట్లో చాకిరీ చేయించుకుంది.

NRI Crime: ఇంట్లో పనికంటూ ఇద్దరు మహిళలను భారత్‌ నుంచి రప్పించి మరీ ఓ ఎన్నారై చేసిన దారుణమిదీ.. 8 ఏళ్లుగా వాళ్లను దాచి..

ఎన్నారై డెస్క్: తననే నమ్ముకుని ఇండియా నుంచి వచ్చిన ఇద్దరు మహిళలను ఓ అమెరికా ఎన్నారై(NRI) దారుణంగా మోసం చేసింది. 8 ఏళ్లుగా వాళ్లను దాచి పెట్టి ఇంట్లో చాకిరీ చేయించుకుంది. వారికి ఇస్తానన్న జీతం సరిగ్గా ఇవ్వకుండా(Fail to pay wages) తాను ఆర్థికకంగా లాభపడింది. పోలీసులతో మాట్లాడితే అమెరికా నుంచి గెంటేస్తారంటూ వారిని భయపెట్టి అదుపులో పెట్టుకుంది. చివరకు ఆమె పన్నిన కుట్ర వెలుగులోకి రావడంతో ఎన్నారైకి తాను తప్పు చేసినట్టు ఒకప్పుకోకతప్పలేదు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. న్యూజెర్సీకి(New Jersey) చెందిన సాహ్నీ ఆ మహిళలిద్దరినీ ఎవరికంటా పడకుండా తన వద్దే ఎనిమిదేళ్ల పాటు దాచిపెట్టింది(Illegally Harbor foreigners). 2013 నుంచి 2021 వరకూ వారితో చట్టవ్యతిరేకంగా ఇంట్లో పనిచేయించుకుంది. తన బంధువుల ఇళ్లల్లోనూ వారితో పనిచేయించింది. మహిళలపై ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు తన కుటుంబసభ్యులతో కలిసి పథకం పన్నింది. పోలీసులతో మాట్లాడితే భారత్‌కు పంపించేస్తారంటూ ఆ ఇద్దరినీ భయపెట్టి అదుపులో ఉంచుకుంది. ఎవరైనా అడిగితే తన బంధువులమని చెప్పాలంటూ వారికి సూచించింది. వారి పేర్లు, అడ్రస్‌లు కూడా మార్చి చట్టానికి దొరక్కుండా జాగ్రత్త పడింది. ఇంట్లోపనికి సహాయకులను నియమించుకున్న సందర్భాల్లో ప్రభుత్వానికి చెల్లించాల్సిన కొన్ని పన్నులను కూడా ఆమె చెల్లించలేదు.

తన బండారం అంతా బయటపడటంతో సాహ్నీ చేసిన నేరాన్ని అంగీకరించింది. ప్రాసిక్యూషన్‌తో ప్లీ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఇందులో భాగంగా బాధితులిద్దరికీ కలిపి 6,42,212 డాలర్ల పరిహారం చెల్లించేందుకు అంగీకరించింది. అంతేకాకుండా.. పనివాళ్లిద్దరిలో ఒకరు బ్రెయిన్ ఆన్యూరిజమ్ అనే వ్యాధి బారిన పడగా..చికిత్స కోసం 2 లక్షల డాలర్లు చెల్లించేందుకూ ఒప్పుకుంది. ఇక పన్నులు ఎగవేసినందుకు పరిహారంగా ప్రభుత్వానికి కొంత మొత్తం చెల్లిస్తాననీ హామీ ఇచ్చింది.

Updated Date - 2023-02-18T16:39:34+05:30 IST