NTR: శక పురుషునికి టైమ్ స్క్వేర్ శత జయంతి నీరాజనం!

ABN , First Publish Date - 2023-05-28T16:11:40+05:30 IST

ఆసేతు హిమాచ‌లం స్థాయికి ఎదిగిన తెలుగింటి అన్న ఎన్టీఆర్ కీర్తి, అమెరికాలో అత్యంత ఖ‌రీదైన ప్రాంతం న్యూయార్స్‌లోని టైమ్ స్క్వేర్‌లోనూ త‌ళుక్కున మెరిసింది.

NTR: శక పురుషునికి టైమ్ స్క్వేర్ శత జయంతి నీరాజనం!

  • టైమ్ స్క్వేర్ చరిత్రలోనే అద్భుతం!!

  • అన్న ఎన్టీఆర్ ఎఫెక్ట్‌ - ఊపిరి బిగ‌బ‌ట్టిన టైమ్ స్క్వేర్‌

  • రికార్డు సృష్టించిన అన్న ఎన్టీఆర్ ప్రక‌ట‌న‌ - ఏ నోట విన్నా అన్న ఎన్టీఆర్ మాటే!!

ఆసేతు హిమాచ‌లం స్థాయికి ఎదిగిన తెలుగింటి 'అన్న ఎన్టీఆర్' కీర్తి, అమెరికాలో అత్యంత ఖ‌రీదైన ప్రాంతం న్యూయార్స్‌లోని 'టైమ్ స్క్వేర్‌'లోనూ త‌ళుక్కున మెరిసింది.

ప్రపంచ పర్యాటకులని, క‌న్ను తిప్పకుండా చేసింది. 200 అడుగుల ఎత్తు, 36 అడుగులు వెడ‌ల్పుతో ఈ ప్రక‌ట‌న ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో ఏకంగా 24 గంట‌ల పాటు 'అన్నగారి' ప్రక‌ట‌న‌ను ఏర్పాటు చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. మే 27 అర్ధరాత్రి నుంచి మ‌రుస‌టి రోజు అంటే 'ఎన్టీఆర్' పుట్టిన రోజు మే 28వ తేదీ అర్ధరాత్రి వ‌ర‌కు ఈ ప్రకటన డిస్ ప్లే అవుతుంది . అన్నగారి విభిన్న క్యారెక్టర్లను ఈ డిస్లేపై ప్రద‌ర్శించారు. ప‌లు సినిమాల్లో అన్నగారు చూపిన విశ్వరూపాల తాలూకు చిత్రాలు ఈ స‌మాహారంలో కొలువుదీరాయి.

ప్రతి 4 నిముషాల‌కు ఒక‌సారి 15 సెక‌న్ల చొప్పున ఈ ప్రకటన ప్రసారం అవుతుంది. తెలుగువారి ఆత్మగౌర‌వాన్ని చిర‌స్థాయిగా చ‌రిత్రలో నిలిపిన ఎన్టీఆర్‌‌కు ద‌క్కడం మ‌రో గౌర‌వం. క‌నుల విందుగా మారిన 'అన్నగారి' విశ్వరూపాలను ఎన్నారైలు, స్థానికులు, చిన్నారులు, న్యూయార్క్‌కు ప్రపంచ వ్యాప్తంగా వచ్చే పర్యాటకులు, ఇలా అనేక మంది ఊపిరి బిగ‌బ‌ట్టి మ‌రీ 'టైమ్ స్క్వేర్‌'లో ఉల్లాసంగా వీక్షించి, ఆయ‌న ఎవ‌రు? ఎక్కడివారు? ఎందుకు ఇక్కడ ఏర్పాటు చేశారు? విశేషం ఏంటి? ఆయ‌న సినిమాలు, రాజకీయం, వ్యక్తిత్వం ఇలా అనేక కోణాల్లో 'అన్నగారి' చ‌రిత్రను తెలుసుకునే ప్రయ‌త్నం చేయ‌డం గ‌మ‌నార్హం.

అన్న ఎన్టీఆర్ శ‌త జ‌యంతిని పుర‌స్కరించుకుని జయరాం కోమటి పర్యవేక్షణలో ఎన్నారై టీడీపీ క్రింద 28 నగరాల్లో ఉన్న కార్యనిర్వాహక కమిటీ సభ్యులంతా కలిసి శ‌త వ‌త్సర వేళ‌, తొలి ప్రయత్నంగా ఏర్పాటు చేసిన అన్న ఎన్టీఆర్ ప్రకటనకి, అన్నగారి ఆశీస్సులు తోడై, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్నగారి అభిమానులని కేరింతలు కొట్టించింది.

3.jpg2.jpg

Updated Date - 2023-05-28T16:11:45+05:30 IST