ప్రయాణం కూల్‌గా...
ABN , First Publish Date - 2023-02-21T22:54:04+05:30 IST
దూర ప్రయాణాలంటే అందరికీ టెన్షనే. అలాంటి ప్రయాణాన్ని సులభంగా ఎలా ప్లాన్ చేసుకోవాలో చూద్దాం...
దూర ప్రయాణాలంటే అందరికీ టెన్షనే. అలాంటి ప్రయాణాన్ని సులభంగా ఎలా ప్లాన్ చేసుకోవాలో చూద్దాం..
ముందుగానే టికెట్లు, హోటల్ రూమ్ బుకింగ్స్ డీటైల్స్ చెక్ చేసుకోవాలి. దీని వల్ల చివరి నిమిషంలో టెన్షన్ ఉండదు.
మంచినీళ్లకు ఇబ్బంది పడకుండా.. లీక్‌ప్రూఫ్ బాటిల్స్, ఎక్కువ బట్టలు పట్టడానికి ప్యాకింగ్ క్యూబ్స్‌ను ఉంచుకోవాలి.
ఫోనుల్లో ఛార్జింగ్ తప్పనిసరి కాబట్టి పవర్ బ్యాంక్స్‌ను దగ్గర ఉంచుకుంటే మంచిది. కొన్ని ప్రదేశాల్లో ఛార్జింగ్ పోర్ట్స్ సరిగ్గా ఉండవు. అందువల్ల ఎడాప్టర్లు కూడా వెంట తీసుకువెళ్లాలి.
ఈ మధ్యకాలంలో టిక్కెట్లతో పాటుగా ట్రావెల్ ఇన్సూరెన్స్‌లు లభిస్తున్నాయి. వీటివల్ల చాలా ప్రయోజనాలున్నాయి. కొద్దిగా ఖర్చు ఎక్కువైనా ట్రావెల్ ఇన్సూరెన్స్ చేయించుకోవటం మంచిది.
వీలైనంత శ్రమను తగ్గించుకొనేలా టూర్‌ను ప్లాన్ చేసుకోవాలి. ఆరోగ్య సమస్యలు ఎదురైతే తట్టుకోవటానికి అవసరమైన మందులను కూడా తీసుకువెళ్తే మంచిది.
ఖర్చు ఎక్కువైనా పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడానికే ప్రయత్నించండి. అలాగే తప్పనిసరిగా శానిటైజర్ బ్యాగ్‌లో ఉంచుకోండి.
అలాగే మంచి నిద్ర కూడా అవసరం. దీనివల్ల రీచార్జ్ అవుతారు. ఉదయం లేవగానే కాసేపు వాకింగ్ చేయండి. కొత్త ప్రాంతాల్లో నడవటం వల్ల ఆహ్లాదంగా, ఉల్లాసంగా ఉంటుంది.