Vastu Tips: ఇంటికి వీధిపోటు ఉండటం మంచిదేనా? వీధిపోటు ఉంటే ప్రాణనష్టం తప్పదా?

ABN , First Publish Date - 2023-04-10T11:18:29+05:30 IST

ఉత్తర వాయువ్యంలో వీధిపోటు ఉంటే ఇంట్లోని స్త్రీలకు చేటు కలుగుతుంది.

Vastu Tips: ఇంటికి వీధిపోటు ఉండటం మంచిదేనా? వీధిపోటు ఉంటే ప్రాణనష్టం తప్పదా?
Vasthu Sastra

వాస్తు ప్రకారం ఇంటికి వీధిపోటు ఉంటే ప్రజల్లో భయం ఉంటుంది. ఇది మంచిది కాదని, అశుభాలను తెస్తుందని ఇలా రకరకాల అపోహలు మనసులో ఉంటాయి. అసలు ఈ వీధిపోటు మంచిదేనా? దీనివల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి. దీని గురించి తెలుసుకోవాలంటే..ఏదైనా ఇల్లు కొనాలన్నా, అందులో ఉండాలన్నా కూడా వీధిపోటు ఉందని తెలియగానే ఏదో కీడు జరుగుతుందని అనుకుంటూ ఉంటారు. అసలు వీధి పోటు వల్ల ఎలాంటి ఫలితాలుంటాయి. నిజానికి అన్ని వీధిపోటు ప్రమాదకరం కాదు.

తూర్పున వీధిపోటు ఉంటే..

ఇంటికి ఎదురుగా వీధి ఉండి వీధి నుంచి డైరెక్ట్ గా చూపు ఇంటిమీద పడుతుంటే దానిని వీధి పోటు అంటారు. ఇంటి వీధి పోటు తూర్పున ఉంటే ప్రభుత్వంతో చిక్కులు తెస్తుందట.

ఆగ్నేయంలో వీధిపోటు..

ఆగ్నేయంలో వీధిపోటు ఉంటే అనుకోని కష్టాలు వస్తాయి. ఆ ఇంట్లో ధనం నిలవ ఉండదు. నైరుతిలో పోటు ఉంటే ఇంట్లోని వారికి మానసిక ఆందోళనలు కలుగుతాయి. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. ఇక నైరుతిలో వీధిపోటు ఉన్నట్లయితే ఏ పని చేసినా ఫలించదు.

ఇంటికి దక్షిణాన వీధిపోటు ఉంటే

ఉత్తర వాయువ్యంలో వీధిపోటు ఉంటే ఇంట్లోని స్త్రీలకు చేటు కలుగుతుంది. వీరికి తరచూ అనారోగ్యాలు కలుగుతాయి. వివాహాలు ఆలస్యం అవుతాయి. ఉద్యోగం రావడం కష్టం. కుటుంబంలో వారు అకాల మరణం చెందుతారు. పరిస్థితులు అనుకూలంగా ఉండవు.

పశ్చిమాన నైరుతి పోటు వల్ల..

పశ్చిమ నైరుతి పోటు ఇంట్లో నివసించే మగవారికి చేటు చేస్తుంది. సరైన వృత్తి లేక ఉన్న వృత్తిలో ఎదుగుదల లేక బాధపడతారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు వాస్తు పరమైన మార్పులు చేసుకోవడం, లేదా నివారణ చర్యలను వాస్తు నిపుణుల ద్వారా తెలుసుకుని చేయడం ముఖ్యం.

Updated Date - 2023-04-10T11:18:29+05:30 IST