vastu tips: ఆరోగ్యాన్ని, ఆనందాన్ని కలిపి ఇచ్చే వాస్తు సూచనలు తెలుసా? ఇలా చేస్తే రెండూ ఖాయం..!

ABN , First Publish Date - 2023-03-24T10:56:11+05:30 IST

నొప్పి, విచారం, దుఃఖాన్ని లాంటి బాధలను తొలగించాలంటే..

vastu tips: ఆరోగ్యాన్ని, ఆనందాన్ని కలిపి ఇచ్చే వాస్తు సూచనలు తెలుసా? ఇలా చేస్తే రెండూ ఖాయం..!
Vastu Tips For Home

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా చర్చించుకునే అంశం ఆరోగ్యం. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, సురక్షితంగా ఉంచడానికి వివిధ మార్గాల కోసం వెతుకుతునే ఉంటారు. చిన్న చిన్న మార్పులతో వాస్తు అనుసరించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇంట్లోని ప్రతికూల వాతావరణాన్ని తొలగించవచ్చు. అదేలాగంటే.. కొన్ని సులభమైన చిట్కాలను తెలుసుకుందాం.

1. మొక్కలు

ఇండోర్ వాతావరణాన్ని ప్రశాంతంగా, కళగా ఉంచడానికి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఇంట్లో ఉండే మొక్కల కంటే మెరుగైనది ఏదీ లేదు. అవి పరిసరాలను మెరుగుపరచడంలో సహాయపడతాయి. తులసి , అలోవెరా, ఫికస్, మనీ ప్లాంట్, అరేకా పామ్ వంటి కొన్ని వాస్తు ధృవీకరించబడిన రకాల మొక్కలు మన పెరళ్లలో ఉండటం మంచిది.

2. రాతి ఉప్పుతో ఇంటిని శుభ్రం చేయండి.

పింక్ రాక్ ఉప్పు ఇండోర్ వాతావరణాన్ని సమర్థవంతంగా మెరుగుపరుస్తుంది. ఈ స్ఫటికాలలో ఉండే శక్తివంతమైన గాలి ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. గది నాలుగు మూలల్లో ఒక గిన్నె రాతి ఉప్పు ఉంచండి. అంతే కాకుండా ఉప్పుకలిపిన నీటితో కూడా వారానికి ఒకసారి నేల శుభ్రం చేయండి. ఇది గాలిలో వైరస్, బ్యాక్టీరియాను క్లియర్ చేస్తుంది. మంచి శక్తిని ఉత్పత్తి చేయడానికి అనారోగ్యంతో ఉన్న వ్యక్తి దగ్గర ఉప్పు గిన్నెను ఉంచవచ్చు. ఉప్పును క్రమం తప్పకుండా మారుస్తూ ఉండాలి.

3. నీటిని ఆదా చేయండి.

వాస్తు ప్రకారం, నీరు ఆరోగ్యం, సంపద రెండూ సమానమైన శక్తులు, వీటి వృధా తీవ్రమైన ఆరోగ్య సమస్యలను సృష్టిస్తుంది. పక్షులకు నీటితో నింపిన గిన్నెను ఉంచడం వాస్తు ప్రకారం శ్రేయస్సును సానుకూలంగా ప్రభావితం చేస్తుంది.

ఇది కూడా చదవండి: మీ ఇంట్లో ఈ మొక్క ఉందా? ఎక్కడ పెట్టారు? సరైన దిశలో ఉంచకపోతే భార్యాభర్తల మధ్య వాదనలు, వైవాహిక సమస్యలు ఉంటాయట..?

4. ఆహారాన్ని సరైన స్థలంలో నిల్వ చేయండి.

తృణధాన్యాలు, ఇతర ఆహారాన్ని వంటగది నైరుతి దిశలో నిల్వ చేయాలి, ఎందుకంటే ఇది అదృష్టాన్ని, శ్రేయస్సును ఆహ్వానిస్తుంది.

5. కర్పూరాన్ని వెలిగించండి.

కనీసం వారానికి ఒకసారి ఇంట్లో కర్పూరాన్ని కాల్చడం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. వేప, నిమ్మరసం మిశ్రమం గాలిని శుద్ధి చేస్తుంది.

6. పండ్లు

పండ్లతో నిండిన బుట్ట మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. అందమైన బుట్టలో రంగురంగుల పండ్లను సెంటర్ టేబుల్ మీద ఉంచడం ఆరోగ్యకరమైన జీవనశైలిని అందిస్తుంది.

7. వెలుగు కావాలి.

సహజంగా లేదా కృత్రిమంగా బాగా ప్రకాశించే ప్రవేశ ద్వారం ఇంటిలో సానుకూల భావనను ఇస్తుంది. ప్రవేశ మార్గానికి ప్రక్కన ఒక కిటికీలో దీపం లేదా దియాను ఉంచడం వల్ల అది ప్రకాశవంతంగా వెలిగితే మనసులోని భయాలు తొలగిపోతాయి. ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది.

8. విరిగిన వస్తువులు వద్దు.

గదిలో ప్రతికూల శక్తి ఆపి, నొప్పి, విచారం, దుఃఖాన్ని లాంటి బాధలను తొలగించాలంటే.. ఫోటో ఫ్రేమ్‌లు, అద్దాలు వంటి ఏవైనా విరిగిన వాటినితక్షణమే తొలగించాలి, ఇంట్లో ప్రతికూలత లేకుండా చూడాలి.

9. వెలుగు ఉండే బాత్‌రూమ్‌

బాత్రూమ్ వాస్తులో వెంటిలేషన్ ముఖ్యమైన లక్షణం. బాత్రూమ్ కిటికీ , ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఎప్పుడూ ఈశాన్యం వైపు ఉండాలి. ఇది బ్యాక్టీరియా తొలగించడంలో సహాయపడుతుంది. అది పరిశుభ్రమైన వాతావరణాన్ని ప్రేరేపిస్తుంది.

Updated Date - 2023-03-24T10:56:11+05:30 IST