Vivekananda Day 2023: ఆ విషయం అంత ప్రాచుర్యంలోకి రాకపోయినా.. !

ABN , First Publish Date - 2023-02-06T15:52:52+05:30 IST

సనాతన ధర్మ పూర్వవైభవాన్ని పునఃస్థాపించడానికే ఆయన ఈ భూమిపైకి ఏతెంచారు.

Vivekananda Day 2023: ఆ విషయం అంత ప్రాచుర్యంలోకి రాకపోయినా.. !
Vivekananda

జీవితపు సవాళ్ళను ఎదుర్కొనే సామర్థ్యం, ప్రావీణ్యం, ప్రేరణ మనిషికి అనుభవాలనుంచి వస్తే.. ఆ అనుభవాలు మహనీయులు ఆచరించిన అనంతమైన ప్రసంగాల శక్తి పంచిన వివేకంతో ఏర్పడుతుంది. శక్తిని భగవంతునితో మమేకమైనప్పుడు, వ్యక్తిగత సంబంధాన్ని పెంపొందించుకోనే మార్గాన్ని చూపే వెలుతురున్న దారిలోకి నడిపే ప్రసంగం అవుతుంది., ప్రతి ఒక్కరిలోనూ దాగొని ఉన్న అనంతమైన అంతర్గత శక్తుల మేలు కలయికవుతుంది. వివేకానందుని సనాతన ధర్మ పూర్వవైభవాన్ని పునఃస్థాపించడానికే ఆయన ఈ భూమిపైకి ఏతెంచారు. 1893వ సంవత్సరంలో స్వామి వివేకానంద హైదరాబాదును సందర్శించడం అనేది అంత ప్రాచుర్యంలోకి రాకపోయినా..

2147.jpg

స్వామి వివేకానంద తన జీవితంలో ఓ బహిరంగసభను ఉద్దేశించి తొలిసారిగా ప్రసంగించింది భాగ్యనగరంలోనే అని అతి కొద్దిమందికి మాత్రమే తెలుసు. ఫిబ్రవరి 10వ తేదీన కాషాయాంబరాలు ధరించి, చేత కమండలంతో మొదటి తరగతి రైలు పెట్టె నుండి దిగిన స్వామీజీకి స్వాగతం పలకడానికి ఎందరో వచ్చారు. అందులో హిందువులు, మహమ్మదీయులు కూడా ఉన్నారు. స్వామికి చాలా ఘనమైన ఆహ్వానం లభించింది.

Untitled-7.jpg

మరువాడు 1893 ఫిబ్రవరి 10 నుంచి 17 వరకూ భాగ్యనగరంలో పర్యటించిన ఆయన ఫిబ్రవరి 13న సికింద్రాబాద్ మహబూబ్ కాలేజీలో మై మిషన్ టు ద వెస్ట్ (పాశ్చాత్యానికి వెళ్లడంలోని నా ఉద్దేశం) అనే అంశంపై తొలి చారిత్రక ప్రసంగం చేశారు. ఈ ప్రసంగానికి యూరోపియన్లు, మేధావులు, విద్యావేత్తలు, యువకులు సహా సుమారు వెయ్యిమంది హాజరయ్యారు. దాదపు రెండు గంటలకు పైగా మాట్లాడారు. ఇందులో ముఖ్యంగా పాశ్చాత్వానికి వెళ్ళడంలోని నా ఉద్దేశ్యం అని ప్రసంగించారు. స్వామివారి ఇంగ్లీషు భాషమీద అవగాహనను చూసి అంతా ఆశ్చర్యపోయారు. ప్రపంచం యావత్తు ఆయన ఉద్విగ్న ప్రసంగానికి దాసోహమై జయహో అని ఆకాశానికి ఎత్తుకుంది. హిందూ మత ప్రాశస్త్యమూ, సనాతన హైందవ సమాజమూ, సంస్కృతి, వేద వేదాంత భావనలూ, పురాణాలు బోధించే నైతిక ఆదర్శాలు ఇలా అనేక అంశాల గురించి సవిరంగా ప్రస్తావించారు.

Untitled-4.jpg

అమెరికాలోని చికాగోలో విశ్వమత ప్రతినిధుల సభలో పాల్గొనడానికి వెళ్లే ముందు హైదరాబాద్‌ బహిరంగ సభలో ప్రసంగించడం ద్వారా తన ఉపన్యాస నైపుణ్యాలను పరీక్షించుకున్నట్లు స్వామి తన శిష్యులతో స్వయంగా చెప్పారు. స్వామి వివేకానందలో ఆత్మవిశ్వాసం ఇనుమడింపచేసిన భాగ్యనగర పర్యటన ఆ తర్వాత విశ్వవేదికపై జైత్రయాత్ర కొనసాగేలా చేసింది.

Untitled-5..jpg

ఎందరో మహనీయులకు స్పూర్తిగా నిలిచిన వివేకానందుడు 1893 ఫిబ్రవరి 10 నుంచి 17 వరకూ భాగ్యనగర ప్రయాణం గురించి చెప్పుకుంటే, చార్మినార్. మక్కా మసీద్, గోల్కొండ కోట ప్రాంతాలన్నింటినీ స్వామీజీ సందర్శించారు. అప్పుడే ఫిబ్రవరి 13న సికింద్రాబాద్ మెహబూబ్ కాలేజీలో ఆయన 'మై మిషన్ టు ద వెస్ట్' అనే అంశం పై తొలి చారిత్రక ప్రసంగం చేశారు. ముఖ్యంగా

Untitled-6.jpg

స్వామి వివేకానంద భాగ్య నగర పర్యటన, చారిత్రక ప్రసంగం నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 13ను వివేకానంద డే గా గుర్తించాలంటూ రామకృష్ణ మఠం వాలంటీర్లు, హైదరాబాద్ యూత్ కొన్ని సంవత్సరాలుగా కోరుతున్నారు. అనేకమంది మేధావులను, విద్యావేత్తలను, విద్యార్ధినీ విద్యార్ధులను కలుస్తున్నారు. స్వామి వివేకానంద హైదరాబాద్ పర్యటన ప్రాధాన్యత గురించి వివరిస్తున్నారు. సంతకాల సేకరణ చేస్తున్నారు. వేలాది మంది ఇప్పటికే తమ మద్దతును తెలియజేశారు. తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇప్పటికే ఫిబ్రవరి 13కు మద్దతు పలికారు. రుషిపీఠం వ్యవస్థాపకులు సామవేదం షణ్ముఖ శర్మ, మహాసహస్రావధాని గరికిపాటి నరసింహారావు, దర్శకుడు కె.విశ్వనాథ్, లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ్ తదితరులు ఫిబ్రవరి 13ను వివేకానంద డే గా గుర్తించాలనే క్యాంపెయిన్‌కు మద్దతు తెలిపారు.

Untitled-9.jpg

భరతమాత స్వేచ్ఛ కోసం పోరాటం చేసిన బాల గంగాధర్ తిలక్ నుంచి సుభాష్ చంద్రబోస్ వరకూ అనేకమంది స్వాతంత్ర్య పోరాట వీరులకు స్ఫూర్తిగా నిలిచిన స్వామి వివేకానందతో భాగ్యనగరానికున్న అనుబంధం తెలంగాణకే గర్వకారణం. స్వామి వివేకానంద పాదస్పర్శతో భాగ్యనగరం పవిత్రభూమిగా మారిన సందర్భాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 13ను వివేకానంద డే గా గుర్తించాలని యువత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తోంది.

Untitled-8.jpg

Updated Date - 2023-02-07T15:43:31+05:30 IST