Sri Rama Navami: ఆయన్ను కొలిచేటపుడు అరటిపండ్లతో నివేదన తప్పనిసరి..!

ABN , First Publish Date - 2023-03-30T09:45:33+05:30 IST

వడపప్పు, బెల్లం, మిరియాలు కలిపి తయారు చేసే పానకం చాలా మందికి ప్రీతిపాత్రమైనది.

Sri Rama Navami: ఆయన్ను కొలిచేటపుడు అరటిపండ్లతో నివేదన తప్పనిసరి..!
Sitha ramulu

శ్రీరాముని సుగుణాలే ఆయనను ఆదర్శ పురుషునిగా లోకంలో నిలిచేలా చేసాయి. మన జీవితంలో శ్రీరాముని గుణగణాలను అలవర్చుకుంటే సంతోషం, శ్రేయస్సు మనతో ఉండి మంచి మనుషులుగా నడిపిస్తుందని ఆయనను ఆదర్శంగా చెబుతారు. రాముడి గురించి చెప్పాలంటే..

దశావతారాల్లో ఏడవ అవతారంగా, రావణ సంహరనార్ధమై, శ్రీరాముడు వసంత రుతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారం రోజున పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12గంటలకు జన్మించాడు. ప్రతి సంవత్సరం ఈ రోజునే శ్రీరామనవమిని పండగలా జరుపుకుంటాం. శ్రీరాముని జన్మదినమైన చైత్రశుద్ధ నవమి నాడు "శ్రీ రామ నవమి"గా దేశవ్యాప్తంగా రామునికి పూజలు జరుగుతాయి.

శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద తాటాకు పందిళ్ళు వేసి, మావిడి తోరణాలతో, పూల అలంకరణలతో, సీతారామ కళ్యాణం వైభవంగా చేస్తారు. శ్రీ రాముడికి అరటి పండ్లంటే ప్రీతికరం. ఆయన్ను కొలిచేటపుడు అరటిపండ్లతో నివేదన తప్పనిసరి. బెల్లం, మిరియాలు కలిపి తయారు చేసే పానకం చాలా మందికి ప్రీతిపాత్రమైనది. ఉత్సవ మూర్తుల ఊరేగింపు. రంగు నీళ్ళు చల్లుకుంటూ ఉల్లాసంగా సాగే వసంతోత్సవం పండుగ వాతావరణాన్ని పట్టుకువస్తుంది.

ఇది కూడా చదవండి: కళంకిని అనిపించుకుని నేనింక బ్రతకలేను,.. అగ్నిని ముట్టించు.. సీత అగ్నిపరీక్షకు రాముడే సాక్షి..!

పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాశిస్తారు. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది. ఈ చైత్ర శుద్ధ నవమి నాడు తెలంగాణాలో గల భద్రాచలంలో సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుకుంటారు.

Updated Date - 2023-03-30T10:28:18+05:30 IST