ఈ చిట్కాలతో మెటాబాలిజం భేష్‌!

ABN , First Publish Date - 2023-10-02T23:37:58+05:30 IST

మనం ప్రతి రోజు తినే ఆహారాన్ని శక్తిగా మార్చే ప్రక్రియ మెటాబాలిజం అంటారు. ప్రతి వ్యక్తి జీవించటానికి కొన్ని కేలరీలు అవసరమవుతాయి...

ఈ చిట్కాలతో మెటాబాలిజం భేష్‌!

మనం ప్రతి రోజు తినే ఆహారాన్ని శక్తిగా మార్చే ప్రక్రియ మెటాబాలిజం అంటారు. ప్రతి వ్యక్తి జీవించటానికి కొన్ని కేలరీలు అవసరమవుతాయి. వాటిని దాటి ఎక్కువ కేలరీలు తిన్నప్పుడు స్థూలకాయం ఏర్పడుతుంది. చురుకుదనం తగ్గుతుంది. ఇలా కాకుండా- ఆహారంలోను, వ్యాయామంలోను చిన్న చిన్న మార్పులు చేసి- మెటాబాలిజం రేటును పెంచటం ద్వారా ఉత్సాహంగా ఉండవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఆ చిట్కాలేమిటో చూద్దాం

శరీరంలో కండరాలను పెంచటం ద్వారా మెటాబాలిజయం రేటును పెంచుకోవచ్చు. కండరాలు ఎంత బలంగా ఉంటే- కేలరీలు అన్ని ఎక్కువ అవసరమవుతాయి. అయితే వయస్సు పెరుగుతున్న కొలది కండరాల ధృఢత్వం తగ్గుతూ వస్తుంది. ఈ సమయంలో క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం వల్ల కండరాలు త్వరగా సడలిపోవు. మెటాబాలిజం రేటు తగ్గిపోదు.

ఎక్కువ ప్రొటీన్‌ ఉన్న ఆహారాన్ని తీసుకోవటం వల్ల కండరాల పటుత్వం పెరుగుతుంది. దీని వల్ల మెటాబాలిజం రేటు పెరుగుతుంది. అందువల్ల ఎక్కువ ప్రొటీన్‌ ఉన్న ఆహారాన్ని తీసుకోవటం మంచిది.

ప్రతి రోజు ఆహారం తీసుకున్న తర్వాత నడవటం మంచిది. నడవటం వల్ల శరీరంలో ఉన్న అన్ని కండరాలు కదులుతాయి. అంతేకాకుండా బ్లడ్‌ సుగర్‌ విలువలు అదుపులో ఉంటాయి. దీని వల్ల మన మెటాబాలిజం రేటు కూడా బావుంటుంది.

Updated Date - 2023-10-02T23:37:58+05:30 IST