వంటింటి చిట్కాలు
ABN , First Publish Date - 2023-07-12T23:17:41+05:30 IST
కూరలో పులుపు తక్కువైతే మామిడిపొడితో పాటు కొంచెం పెరుగు వేస్తే టమోటా రుచి వస్తుంది....
కూరలో పులుపు తక్కువైతే మామిడిపొడితో పాటు కొంచెం పెరుగు వేస్తే టమోటా రుచి వస్తుంది.
పెరుగుపచ్చడి రుచిగా ఉండాలంటే తాలింపు పెట్టేప్పుడు కొద్దిగా నెయ్యి వేయాలి.
కట్ చేసిన బెండకాయల మీద నిమ్మరసం చల్లి వంట చేస్తే బెండకాయలమీద జిగురు ఉండదు.
వెల్లుల్లి రెబ్బలను నీటిలో నానబెట్టి తీస్తే త్వరగా పొట్టు వదిలిపోతుంది.
గొంతు నొప్పిగా ఉంటే రెండు స్పూన్ల తులసి రసంలో కొంత తేనె వేసి తాగితే ఉపశమనం కలుగుతుంది.
కరివేపాకును ఎండబెట్టి పొడిచేసుకుని కూరల్లో వేసుకుని తింటే కమ్మటి వాసన వస్తుంది.
తేనె సీసాలో రెండు మిరియాలు వేస్తే చీమలు రావు.
నిమ్మరసం రోజూ తాగితే కొవ్వు పెరగదు.
బియ్యంలో పురుగులు పట్టకుండా ఉండాలంటే కరివేపాకులు వేయాలి.
కొబ్బరి ముక్కను పెరుగులో వేస్తే త్వరగా పెరుగు పాడవదు.