బీఆర్క్ లో ప్రవేశానికి నాటా

ABN , First Publish Date - 2023-03-24T02:08:10+05:30 IST

కౌన్సిల్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌(సీఓఏ) - నేషనల్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఆర్కిటెక్చర్‌(నాటా) 2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

బీఆర్క్ లో ప్రవేశానికి నాటా

కౌన్సిల్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌(సీఓఏ) - నేషనల్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఆర్కిటెక్చర్‌(నాటా) 2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇందులో సాధించిన స్కోర్‌ ఆధారంగా అయిదేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ (బీఆర్క్‌) కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆర్కిటెక్చరల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌లో చేరే అవకాశం లభిస్తుంది.

అర్హత వివరాలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి మేథమెటిక్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ ప్రధాన సబ్జెక్టులతో ఇంటర్‌/ పన్నెండోతరగతి/ తత్సమాన కోర్సు ఉత్తీర్ణులైనవారు; పదోతరగతి తరవాత మేథ్స్‌ ఒక సబ్జెక్టుగా మూడేళ్ల డిప్లొమా పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం చివరి సంవత్సర పరీక్షలు రాసేవారు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు. గ్రూప్‌ సబ్జెక్టులతోపాటు మొత్తమ్మీద కనీసం 50 శాతం మార్కులు ఉండాలి.

నాటా 2023 వివరాలు

ఇది కంప్యూటర్‌ బేస్డ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌. దీనిని ఈ ఏడాది(2023) మూడుసార్లు నిర్వహించనున్నారు. అభ్యర్థులు అన్నింటికీ హాజరు కావచ్చు. రెండు టెస్ట్‌లకు హాజరైన పక్షంలో రెంటిలో బెస్ట్‌ స్కోర్‌ను; మూడింటికీ హాజరైతే వాటిలో రెండు బెస్ట్‌ స్కోర్‌ల యావరేజ్‌ను వ్యాలిడ్‌ స్కోర్‌గా పరిగణిస్తారు.

ఇందులో మొత్తం 125 ప్రశ్నలు ఇస్తారు. వీటిలో మల్టిపుల్‌ చాయిస్‌, మల్టిపుల్‌ సెలెక్ట్‌, ప్రిఫరెన్షియల్‌ చాయిస్‌, న్యూమరికల్‌ ఆన్సర్‌, మ్యాచ్‌ ద ఫాలోయింగ్‌ ప్రశ్నలు ఉంటాయి. మేథమెటిక్స్‌, ఫిజిక్స్‌, జామెట్రీ, లాంగ్వేజ్‌ అండ్‌ ఇంట్రప్రిటేషన్‌, ఎలిమెంట్స్‌ అండ్‌ ప్రిన్సిపల్స్‌ ఆఫ్‌ డిజైన్‌, ఈస్థటిక్‌ సెన్సిటివిటీ, కలర్‌ థియరీ, లేటరల్‌ థింకింగ్‌, లాజికల్‌ రీజనింగ్‌, విజువల్‌ పర్సెప్షన్‌, కాగ్నిషన్‌, గ్రాఫిక్స్‌, బిల్డింగ్‌ అనాటమీ, ఆర్కిటెక్చరల్‌ ఒకాబులరీ, బేసిక్‌ టెక్నిక్స్‌ ఆఫ్‌ బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌, నాలెడ్జ్‌ ఆఫ్‌ మెటీరియల్‌, జనరల్‌ నాలెడ్జ్‌, కరెంట్‌ అఫైర్స్‌ తదితర అంశాలనుంచి ప్రశ్నలు ఇస్తారు. డయాగ్రమెటిక్‌ రీజనింగ్‌, న్యూమరికల్‌ రీజనింగ్‌, వెర్బల్‌ రీజనింగ్‌, ఇండక్టివ్‌ రీజనింగ్‌, సిట్యుయేషనల్‌ జడ్జ్‌మెంట్‌, లాజికల్‌ రీజనింగ్‌, అబ్‌స్ట్రాక్ట్‌ రీజనింగ్‌ అంశాలపై అభ్యర్థి అవగాహనను పరీక్షించేలా ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నలన్నీ ఆంగ్ల మాధ్యమంలోనే ఉంటాయి. కొన్నింటిని మాత్రం ప్రాంతీయ భాషల్లో ఇచ్చే అవకాశం ఉంది. మొత్తం మార్కులు 200. పరీక్ష సమయం మూడు గంటలు. ఈ ఎగ్జామ్‌లో అర్హత పొందాలంటే 70 మార్కులు రావాలి.

- ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్‌ 10

- కరక్షన్‌ విండో ఓపెన్‌: ఏప్రిల్‌ 8 నుంచి 10 వరకు

- అడ్మిట్‌ కార్డ్‌ల డౌన్‌లోడింగ్‌: ఏప్రిల్‌ 18 నుంచి

- నాటా 2023 తేదీ: ఏప్రిల్‌ 21న

- ఫలితాలు విడుదల: ఏప్రిల్‌ 30న

-ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: మే 13

-కరక్షన్‌ విండో ఓపెన్‌: మే 9 నుంచి 13 వరకు

-అడ్మిట్‌ కార్డ్‌ల డౌన్‌లోడింగ్‌: మే 21 నుంచి

-నాటా 2023 తేదీ: మే 28న

-ఫలితాలు విడుదల: జూన్‌ 5న

-ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: జూన్‌ 24

-కరక్షన్‌ విండో ఓపెన్‌: జూన్‌ 20 నుంచి 24 వరకు

-అడ్మిట్‌ కార్డ్‌ల డౌన్‌లోడింగ్‌: జూలై 2 నుంచి

- నాటా 2023 తేదీ: జూలై 9న

ఫలితాలు విడుదల: జూలై 17న

ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: ఏదైనా ఒక టెస్ట్‌ రాయడానికి పురుషులకు రూ.2000; మహిళలు, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1500. ఏవైనా రెండు టెస్ట్‌లు రాయడానికి పురుషులకు రూ.4000; మహిళలు, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.3000. మూడు టెస్ట్‌లూ రాయడానికి పురుషులకు రూ.5400; మహిళలు, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.4050

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, గుంటూరు, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం.

వెబ్‌సైట్‌: nata.in

Updated Date - 2023-03-24T02:13:15+05:30 IST