ఉదయాన్నే ఖర్జురాలు మంచివే!
ABN , First Publish Date - 2023-10-02T23:36:41+05:30 IST
ఖర్జురాలలో పొటాషియం, మెగ్నిషియం, సిలీనియంలతో పాటుగా అనేక మినరల్స్ కూడా ఉంటాయి.
రబ్ దేశాలలో ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఖర్జురాలను తప్పనిసరిగా తింటారు. వీటిని ఉదయాన్నే తింటే - రోజంతా ఉత్సాహంగా ఉండటానికి తోడ్పడతాయని పౌష్టికాహార నిపుణులు చెబుతున్నారు.
ఖర్జురాలలో పొటాషియం, మెగ్నిషియం, సిలీనియంలతో పాటుగా అనేక మినరల్స్ కూడా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యవంతంగా ఉంచటంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. వీటిలో విటమిన్ కె ఉంటుంది. ఇది రక్తప్రసారం సక్రమంగా జరగటానికి ఉపకరిస్తుంది.
ఖర్జురాలలో విటమిన్ సి, విటమిన్ డీ ఉంటాయి. ఇవి చర్మసమస్యల నుంచి కాపాడతాయి.
వీటిలో ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది. అందువల్ల జీర్ణవ్యవస్థను బలోపేతమవుతుంది.
ఖర్జురాలు నాడీ వ్యవస్థకు చాలా ఉపకరిస్తాయి. మెదడులో వాపును తగ్గిస్తాయి. వృద్ధుల్లో నాడీవ్యవస్థకు సంబంధించిన సమస్యలను తగ్గిస్తాయి. అందువల్ల వృద్ధులు ప్రతి రోజు కనీసం రెండు ఖర్జురాలు తినటం మంచిది. వీటిలో ఉండే మెగ్నిషియం నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయటంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది.
ఖర్జురాలు పేవుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందటానికి ఉపకరిస్తాయి. దీని వల్ల పేవులకు వచ్చే అనేక సమస్యలు తగ్గిపోతాయి.