Share News

యు ఆర్ అటెన్షన్ ప్లీజ్

ABN , First Publish Date - 2023-11-01T00:52:37+05:30 IST

ప్రభావం చూపని విగ్రహాలకు ముసుగులు వేసి బ్యూరోక్రసీ భయపెడుతుంది ప్రలోభపెట్టే నాయకులకు కళ్లెం వేయని డెమోక్రసీ...

యు ఆర్ అటెన్షన్ ప్లీజ్

ప్రభావం చూపని

విగ్రహాలకు ముసుగులు వేసి

బ్యూరోక్రసీ భయపెడుతుంది

ప్రలోభపెట్టే నాయకులకు

కళ్లెం వేయని డెమోక్రసీ

గజగజ వణికిపోతుంది

తుప్పు పట్టిన వాగ్దానాలు

నీళ్ల మీద రాతలు

మోసానికే వాతలు పెట్టే మోసాలు

ఉన్నా లేకున్నా కొన్న వస్తువులపై

జిఎస్‌టి ఎస్‌జిటి

నీ జేబుకు కన్నం పెడుతాయి

క్షామం సృష్టించిందే సంక్షేమం

డేగ మారువేషం వేసింది

వేషాలు ఎన్నెన్నో రకాలు

మాటలతో మూటలతో

సీసాలతో ఆశలతో

తియ్య తియ్యని ఓట్ల పాటలు

గదువ పట్టుకుని చివరికి

నిన్ను గంగల నిమజ్జనం చేస్తారు

బోల్తా కొట్టించే సలహాలు నివేదికలు

ఎలక్షన్స్ ఈవెంట్ మేనేజర్లు

రాజకీయ పార్టీలను నడిపిస్తుంటారు

ఓటర్ అన్నా!

యు ఆర్ అటెన్షన్ ప్లీజ్

జూకంటి జగన్నాథం

Updated Date - 2023-11-01T00:52:37+05:30 IST