అదాని విషయంలో నిజాలు తేల్చాలి

ABN , First Publish Date - 2023-02-07T02:03:25+05:30 IST

ప్రపంచ కుబేరుల్లో ఆకస్మికంగా రెండో స్థానానికి ఎగబాకి, అంతకన్నా అనూహ్యంగా కేవలం రెండు వారాల వ్యవధిలో రెండంకెల స్థానానికి...

అదాని విషయంలో నిజాలు తేల్చాలి

ప్రపంచ కుబేరుల్లో ఆకస్మికంగా రెండో స్థానానికి ఎగబాకి, అంతకన్నా అనూహ్యంగా కేవలం రెండు వారాల వ్యవధిలో రెండంకెల స్థానానికి దిగజారిన భారతీయ పారిశ్రామికవేత్త అదాని వ్యవహారం నేడు దేశాన్ని కుదుపుతోంది. పార్లమెంటు ఉభయసభల్లో ఆ వ్యవహారంపై చర్చ కోసం పట్టుబడుతున్న ప్రతిపక్షాలు, అవసరం లేదంటున్న అధికార పక్షాల వైఖరి వల్ల ఏ చర్చలూ జరగకుండానే వాయిదాలు పడుతున్నాయి. స్టాక్ మార్కెట్ విపరీతమైన కుదుపులకు లోనవుతుంది. అదాని సంస్థల్లో షేర్ల ధరల పతనంతో కోట్లాది రూపాయలు ఆవిరవుతున్నాయి. ఆ షేర్లలో మదుపుచేసిన కోట్లాది మంది నష్టపోతున్నారు. దేశ సంపద ఆవిరవడమే కాకుండా విదేశీ, స్వదేశీ మదుపరుల్లో మన మార్కెట్‌పై నమ్మకం సడలే అవకాశం ఉంది. అది ఆర్థిక వ్యవస్థకు మరింత చేటు. హిండెన్ బర్గ్ సంస్థ నివేదిక తెచ్చిన కుదుపుని దృష్టిలో పెట్టుకొని అయినా ప్రభుత్వం స్పందించాలి. నిజానిజాలు తేల్చేలా చర్యలు తీసుకోవాలి.

డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం

Updated Date - 2023-02-07T02:03:34+05:30 IST