దేవుడున్నాడు, మధ్యలో సలహాదార్లెందుకు?
ABN , First Publish Date - 2023-03-02T00:54:03+05:30 IST
ఫాస్టర్ల సమస్యలూ, క్రిష్టియన్ల సమస్యలూ ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తెలియచేసేందుకు ఒక ప్రభుత్వ సలహాదారుని నియమిస్తామని...
ఫాస్టర్ల సమస్యలూ, క్రిష్టియన్ల సమస్యలూ ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తెలియచేసేందుకు ఒక ప్రభుత్వ సలహాదారుని నియమిస్తామని నిన్న తాడేపల్లి ప్యాలెసులో ముఖ్యమంత్రి చేసిన ప్రకటన రాజ్యాంగ విరుద్ధం. ఇప్పటికే 60–70 మంది ఉన్న సలహాదారుల్లో ఒక్కరైనా ‘మతస్థుల కోసం సలహాదారులేమిటి?’ అని ముఖ్యమంత్రికి చెప్పలేకపోయారా! సలహాదారులకు రాజ్యాంగం గురించి తెలియదు అనుకున్నా, ఐఏఎస్ అధికారులైనా చెప్పాలి కదా! క్రిష్టియన్ మతానికి ఒక సలహాదారు, హిందూ మతానికి ఒక సలహాదారు, ముస్లిం మతానికి ఒక సలహాదారు, బౌద్ధమతానికి ఒక సలహాదారు, ఇలా నియమిస్తూ పోయి, మరి చివరకు ఏ మతానికీ చెందని మాలాంటి హేతువాదులకు కూడా ఒక సలహాదారును నియమిస్తారా? ఒకవేళ అలా నియమిస్తే మా హేతువాదులనే నియమించండి. మతాలపరంగా ఓటర్లను ఆకర్షించేందుకు ఈ రకమైన ప్రకటనలు చెయ్యటం రాజ్యాంగం మీద చేసిన ప్రమాణాలకు విరుద్ధం. ఇలాంటి ప్రకటనల ద్వారా ప్రజలను విడదీయటం సరైనది కాదు. అయినా ఏ మతానికి ఆ దేవుడు ఉన్నాడు కదా వారి మతస్థులను చూసుకోడానికి? మధ్యలో ప్రభుత్వానికి ఏమి పని, డబ్బులు దండగ తప్ప.
నార్నె వెంకటసుబ్బయ్య