Share News

SBI: ఎస్బీఐ కస్టమర్లకు షాక్! వడ్డీ రేట్లు పెంపు.. పెరగనున్న హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్‌ ఈఎమ్‌ఐల భారం!

ABN , Publish Date - Dec 16 , 2023 | 06:26 PM

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వినియోగదారులకు షాకింగ్ న్యూస్. వివిధ రకాల రుణాలపై వడ్డీరేట్లను 5-10 బేసిస్‌ పాయింట్ల వరకు బ్యాంకింగ్ దిగ్గజం సవరించింది. మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ బేస్డ్‌ లెండింగ్‌ రేటు(ఎంసీఎల్‌ఆర్‌)తో అనుసంధానమైన అన్ని రకాల రుణాలపై వడ్డీరేట్లను పెంచింది.

SBI: ఎస్బీఐ కస్టమర్లకు షాక్! వడ్డీ రేట్లు పెంపు.. పెరగనున్న హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్‌ ఈఎమ్‌ఐల భారం!

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వినియోగదారులకు షాకింగ్ న్యూస్. వివిధ రకాల రుణాలపై వడ్డీరేట్లను 5-10 బేసిస్‌ పాయింట్ల వరకు బ్యాంకింగ్ దిగ్గజం సవరించింది (SBI hikes interest rates). మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ బేస్డ్‌ లెండింగ్‌ రేటు(ఎంసీఎల్‌ఆర్‌)తో అనుసంధానమైన అన్ని రకాల రుణాలపై వడ్డీరేట్లను పెంచింది. అలాగే బేస్‌ రేటుని కూడా 15 బేసిస్‌ పాయింట్లు సవరించింది. ఈ పెంపు కారణంగా ఆటో, హోమ్‌లోన్‌ (Home Loans) వంటి లోన్‌లు రుణగ్రహీతలకు మరింత భారం కానున్నాయి.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల మానిటరీ పాలసీ రివ్యూలో రెపో రేటును 6.5% వద్ద యథాతథంగా ఉంచినప్పటికీ స్టేట్‌ బ్యాంక్‌‌తో పాటు పలు ఇతర బ్యాంకులు MCLRను పెంచాయి. పెరిగిన వడ్డీరేట్లు శుక్రవారం నుంచి అమలులోకి వచ్చాయి. MCLR పెరుగుదల కారణంగా అన్ని రకాల లోన్‌లపై ఈఎమ్‌ఐలు పెరగబోతున్నాయి. ఇప్పుడు తాజాగా లోన్‌లు అప్లై చేసే వారు అధిక వడ్డీ రేట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే లోన్‌లు తీసుకున్న వారు ఇకపై కట్టబోయే ఈమ్‌ఎమ్‌లను పెరిగిన వడ్డీ రేట్లు ఆధారంగా చెల్లించాల్సి ఉంటుంది. ఎస్బీఐ బాటలోనే ఇతర బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉంది.

Updated Date - Dec 16 , 2023 | 06:26 PM