Share News

iPhone 14: ఐఫోన్ ప్రియులకు శుభవార్త.. ఐఫోన్ 14పై భారీ తగ్గింపు.. ఇదే చివరి అవకాశం

ABN , Publish Date - Dec 21 , 2023 | 05:07 PM

ఐఫోన్ అంటే ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి..? ప్రతి ఒక్కరూ ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ని కొనాలని అనుకుంటారు. కానీ.. ధరలు తారాస్థాయిలో ఉండటం వల్ల, చాలామంది ఆండ్రాయిడ్ ఫోన్లతోనే సర్దుబాటు చేసుకుంటారు. ఏదైనా ఆఫర్‌లో భాగంగా..

iPhone 14: ఐఫోన్ ప్రియులకు శుభవార్త.. ఐఫోన్ 14పై భారీ తగ్గింపు.. ఇదే చివరి అవకాశం

Big discount on iPhone 14: ఐఫోన్ అంటే ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి..? ప్రతి ఒక్కరూ ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ని కొనాలని అనుకుంటారు. కానీ.. ధరలు తారాస్థాయిలో ఉండటం వల్ల, చాలామంది ఆండ్రాయిడ్ ఫోన్లతోనే సర్దుబాటు చేసుకుంటారు. ఏదైనా ఆఫర్‌లో భాగంగా ధరలు తగ్గినప్పుడు.. ఐఫోన్ విక్రయిద్దామని వేచి చూస్తూ ఉంటారు. అలాంటి వారి కోసమే ఈ బంపర్ ఆఫర్. ప్లిప్‌కార్ట్ సూపర్ వాల్యూ డేస్‌లో భాగంగా.. ఐఫోన్14 మొబైల్‌పై భారీ తగ్గింపు ఉంది. అయితే.. ఈ ఆఫర్ ఈరోజు మాత్రమే అందుబాటులో ఉంది.


iPhone 14 డీల్ ఆఫ్ ది డే

ఫ్లిప్‌కార్ట్ సూపర్ వాల్యూ డేస్ సేల్ సందర్భంగా.. రూ.69,900 ధర కగల ఐఫోన్ 14 128జీవీ వేరియంట్ రూ.58,999 తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది. ఇదే కాదు.. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఆయా ఫోన్ మోడల్స్‌కి తగ్గట్టు ఈ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ వర్తిస్తుంది. దీనికితోడు పలు బ్యాంకులు 10 శాతం వరకు డిస్కౌంట్‌లు అందిస్తున్నాయి. అంటే.. మరో రూ.2 వేల వరకు డబ్బుల్ని ఆదా చేసుకోవచ్చు. ఇంతేకాదండోయ్.. తన వినియోగదారుల కోసం ఫ్లిప్‌కార్ట్ మరో ప్రత్యేకమైన ఆఫర్‌ని కూడా ప్రకటించింది. క్యాష్‌బ్యాక్, కూపన్‌ల ద్వారా ఏకంగా రూ.10,901 వరకు తగ్గింపును పొందవచ్చు. ఓవరాల్‌గా చూసుకుంటే.. ఫ్లాట్ డిస్కౌంట్, ఎక్స్‌ఛేంజ్ ఆపర్లతో పాటు ఇతర ప్రయోజనాల దృష్ట్యా తక్కువ ధరకే ఐఫోన్ 14 ఫోన్‌ని సొంతం చేసుకోవచ్చు.

మరి.. ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు? వెళ్లండి.. ఈ ఒక్క రోజే అందుబాటులో ఉన్న బంపర్ ఆఫర్‌ని వినియోగించుకొని, ప్రీమియర్ స్మార్ట్‌ఫోన్ అయిన ఐఫోన్ 14 ఫోన్‌ని కొనుగోలు చేయండి. ఇంత తక్కువ ధరకు ఈ ఫోన్ కొనుగోలు చేయడానికి ఇదే చివరి అవకాశం. ఒకవేళ ఈ ఛాన్స్ మిస్ అయితే.. గోల్డెన్ ఆఫర్‌ని చేజేతులా పోగొట్టుకున్నట్టే. కేవలం ఐఫోన్ 14 మాత్రమే కాదు.. కెమెరా క్వాలిటీలో ఐఫోన్లకు ధీటుగా పోటీనిస్తున్న శాంసంగ గేలక్సీ S23 FE ఫోన్‌పై కూడా పలు రకాల ఆఫర్లు ఉన్నాయి. ఆ స్మార్ట్‌ఫోన్‌ని కూడా.. తక్కువ ధరకే పొందవచ్చు. వెళ్లండి.. ఈ ఫ్లిప్‌కార్ట్ సూపర్ వాల్యూ డేస్ ఆఫర్‌ని వినియోగించుకోండి.. ప్రీమియర్ స్మార్ట్‌ఫోన్ కొనాలన్న కలను సాకారం చేసుకోండి.

Updated Date - Dec 21 , 2023 | 05:07 PM