Naresh and Pavitra Lokesh: రాత్రి నుంచి పండుగ చేసుకుంటున్నాం

ABN , First Publish Date - 2022-10-28T15:46:17+05:30 IST

టైటిల్ చూసో.. లేదంటే పై ఫొటో చూసో.. ఏదేదో ఊహించేసుకుంటున్నారా? చివరికి తెగించేశారని అనుకుంటున్నారా? నరేష్ (Naresh), పవిత్ర లోకేష్‌ (Pavitra Lokesh)లపై..

Naresh and Pavitra Lokesh: రాత్రి నుంచి పండుగ చేసుకుంటున్నాం
Pavitra Lokesh and Naresh VK

టైటిల్ చూసో.. లేదంటే పై ఫొటో చూసో.. ఏదేదో ఊహించేసుకుంటున్నారా? చివరికి తెగించేశారని అనుకుంటున్నారా? నరేష్ (Naresh), పవిత్ర లోకేష్‌ (Pavitra Lokesh)లపై ఈ మధ్య ఎటువంటి వార్తలు వైరల్ అవుతున్నాయో తెలిసిందే. ఆ వార్తలన్నీ నిజమే అనేలా వారు పదే పదే ఇలా వీడియోలతో చెబుతూనే ఉన్నారు. కానీ.. ఇంకా ఏదో కావాలి.. వారిద్దరూ ఇంకా ఏదో మెసేజ్ ఇవ్వాలని నెటిజన్లు కోరుకుంటూ.. వారి వ్యవహారాన్ని వైరల్ చేస్తున్నారు. అలాంటి వారందరికీ తాజా వీడియోతో వీరిద్దరూ క్లారిటీ ఇచ్చేశారు. తాజాగా అలీ (Ali), నరేష్ నటించిన ‘అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి’ (Andharu Bagundali Andhulo Nenundali) సినిమా.. డైరెక్ట్‌గా ఆహా ఓటీటీలో విడుదలైంది. ఈ సినిమాకు వస్తున్న రివ్యూలు చూసి.. మంచి సక్సెస్ వచ్చిందని తెలిపేందుకు నరేష్ ఓ వీడియోని విడుదల చేశారు. ఈ వీడియోలో పవిత్రా లోకేష్‌పై ఆయన చేతులేసి మాట్లాడటం.. వగైరా వగైరాలతో.. వారి బంధంపై నరేష్ మరోసారి ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు.

ఇక ఈ వీడియోలో నరేష్ మాట్లాడుతూ.. ‘అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి’ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా అలీ, డైరెక్టర్ కిరణ్, ప్రొడ్యూసర్స్‌కు శుభాకాంక్షలు. ఇద్దరు చైల్డ్ ఆర్టిస్ట్‌లు హీరోలుగా, ఆర్టిస్ట్‌లుగా పలు సినిమాలు చేసి.. మళ్లీ హీరోలుగా చేసిన సినిమాకు చాలా మంచి రిజల్ట్ వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. నిన్న రాత్రి నుంచి ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. నాకు వందల వందల మెసేజెస్ వస్తుంటే.. చాలా సంతోషమేసింది. మంచి కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్ విత్ సబ్జెక్ట్ ఉన్న సినిమాలు సక్సెస్ అవుతాయని మరోసారి ‘అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి’ చిత్రం నిరూపించింది. చాలా హ్యాపీగా ఉంది. మేమంతా ఈ సినిమా సక్సెస్‌తో పండుగ చేసుకుంటున్నాం. దాదాపు 41 రివ్యూలు చూశాను. అన్నీ పాజిటివ్‌గానే.. ఇలా ఈ మధ్య కాలంలో చూడలేదు. వరల్డ్ వైడ్ ప్రీమియర్ స్టార్టయింది. మేమంతా హ్యాపీ.. అందరూ బాగుండాలి.. అందులో మేమూ ఉండాలి’’ అని నరేష్ అన్నారు.

మధ్యలో పవిత్ర లోకేష్ మాట్లాడుతూ.. రాత్రి నుండి రివ్యూస్ అన్నీ చదివాను.. చాలా బాగున్నాయి.. అని అంటే.. ‘నాకు తెలుగు నువ్వు చదివి చెప్పలేదుగా’ అని నరేష్ అన్నారు. అనంతరం.. ప్లీజ్ వాచ్ ఇన్ ఆహా.. మరియు అలీ, నరేష్, ఇతర నటీనటులను ఎంకరేజ్ చేయండి.. అని పవిత్ర లోకేష్ పేర్కొంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలోనే కాదు.. యూట్యూబ్‌లో కూడా వైరల్ అవుతోంది.

Updated Date - 2022-10-28T15:49:53+05:30 IST