FIFA Final: వామ్మో.. ఫిఫా వరల్డ్ కప్‌ విజేతకు ప్రైజ్‌మనీ ఇంతా?.. క్రికెట్‌కు, ఫుట్‌బాల్‌కు ఇంత తేడానా..

ABN , First Publish Date - 2022-12-18T19:10:16+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా ఫిఫా వరల్డ్ కప్ (FIFA) ఫైనల్ మ్యాచ్‌‌ ఫీవర్ నెలకొంది. ఫుట్‌బాల్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మెస్సీ నాయకత్వం వహిస్తున్న అర్జెంటీనా ( Argentina) ఒక పక్క.. డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్ (France) మరో పక్క.. ఏ జట్టు విశ్వవిజేతగా నిలుస్తుందనేది ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

FIFA Final: వామ్మో.. ఫిఫా వరల్డ్ కప్‌ విజేతకు ప్రైజ్‌మనీ ఇంతా?.. క్రికెట్‌కు, ఫుట్‌బాల్‌కు ఇంత తేడానా..

ప్రపంచవ్యాప్తంగా ఫిఫా వరల్డ్ కప్ (FIFA) ఫైనల్ మ్యాచ్‌‌ ఫీవర్ నెలకొంది. ఈ ఫైనల్ పోరు కోసం ఫుట్‌బాల్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మెస్సీ నాయకత్వం వహిస్తున్న అర్జెంటీనా ( Argentina) ఒక పక్క.. డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్ (France) మరో పక్క.. ఏ జట్టు విశ్వవిజేతగా నిలుస్తుందనేది ఉత్కంఠను రేకెత్తిస్తోంది. అయితే ఫిఫా విజేతకు ఎంత ప్రైజ్ మనీ దక్కనుంది?, రన్నర్ జట్టుకు ఎంత ? అనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో ఫిఫా వరల్డ్ కప్‌లో జట్లకు ఎంత ప్రైజ్ మనీ అందజేస్తారో ఒకసారి పరిశీలిద్దాం..

వరల్డ్ కప్ గెలిచిన టీమ్‌కు పెద్ద మొత్తంలో నగదు బహుమతి దక్కనుంది. విజేతకు ఏకంగా 42 మిలియన్ డాలర్ల ప్రైజ్‌మనీ దక్కనుంది. అంటే భారతీయ కరెన్సీలో సుమారు రూ.347 కోట్లు దక్కనుంది. ఇక రన్నరప్ టీమ్‌కు 30 మిలియన్ డాలర్ల (సుమారు రూ.248 కోట్లు) మనీ దక్కనున్నట్టు రిపోర్టులు పేర్కొన్నాయి. కాగా క్రికెట్‌కు సంబంధించి టీ20 వరల్డ్ కప్ విజేతకు అందించిన ప్రైజ్‌మనీ కేవలం 1.6 మిలియన్ డాలర్లు (సుమారు రూ.13 కోట్లే) కావడం గమనార్హం. ఈసారి కప్ ఫ్రాన్స్ గెలిస్తే వరుసగా రెండవసారి ఫిఫా కప్‌ను గెలిచిన జట్టుగా రికార్డులకు ఎక్కనుంది. 2018లో క్రొయేషియాపై గెలిచి ఫిఫా కప్‌ను ముద్దాడింది. ఇక అర్జెంటీనా గెలిస్తే ప్రపంచ అత్యుత్తమ ఫుట్‌బాల్ ప్లేయర్లలో ఒకడిగా ఉన్న లియోనెల్ మెస్సీ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరుతుందనడంలో సందేహం లేదు. కాగా ఫైనల్ ఆడుతున్న ఫ్రాన్స్, అర్జెంటీనా ఇప్పటికే రెండుసార్లు వరల్డ్ కప్‌ను ముద్దాడాయి. అర్జెంటీనా 1978, 1986 సీజన్లు.. ఫ్రాన్స్ 1998, 2018 సీజన్లలో టైటిల్స్ గెలిచింది.

మొత్తం ప్రైజ్‌మనీ రూ.3,590 కోట్లు..

ఫిఫా వరల్డ్ కప్ టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ రూ. 3,590 కోట్లుగా ఉంది. విజేతకు - రూ. 344 కోట్లు, రన్నరప్‌కు - రూ. 245 కోట్లు, మూడో స్థానానికి - రూ. 220 కోట్లు, నాలుగో స్థానానికి - రూ. 204 కోట్లు, క్వార్టర్‌ఫైనలిస్టుకు - రూ. 138 కోట్లు, ప్రీ-క్వార్టర్‌ఫైనలిస్టుకు - రూ. 106 కోట్లు, గ్రూప్‌ దశ చేరినందుకు - రూ. 74 కోట్లు చొప్పున దక్కనుంది. దీంతో ఈ ఏడాది ఫిఫా వరల్డ్ కప్‌లో క్రొయేసియా మూడవ స్థానంలో, మొరాకో నాలువ స్థానంలో నిలిచాయి. బ్రెజిల్, నెదర్లాండ్స్, పోర్చుగల్, ఇంగ్లండ్ జట్లు క్వాటర్ ఫైనల్‌కు వచ్చాయి. అమెరికా, సెనెగల్, ఆస్ట్రేలియా, పోలాండ్, స్పెయిన్, జపాన్, స్విట్జర్లాండ్, దక్షిణకొరియా టీమ్‌లు ఇక రౌండ్ 16కు చేరాయి. మరోవైపు టోర్నీలో ఆడిన ఇతర జట్లు ఖతార్, ఈక్వెడార్, వేల్స్, ఇరాన్, మెక్సికో, సౌదీఅరేబియా, డెన్మార్క్, ట్యునీసియా, కెనడా, బెల్జియం, జర్మనీ, కోస్టారికా, సెర్బియా, కెమెరాన్, ఘనా, ఉరుగ్వేలు గ్రూప్ దశకు అర్హత సాధించిన విషయం తెలిసిందే.

Updated Date - 2022-12-18T19:13:31+05:30 IST