New Zealand vs India: తొలి మ్యాచ్ వర్షార్పణం !.. ఒక్క బంతి కూడా పడకుండానే..

ABN , First Publish Date - 2022-11-18T13:45:11+05:30 IST

న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా (New Zealand vs India) మధ్య 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షార్పణమయ్యింది. వరుణ దేవుడు కరుణ చూపకపోవడంతో...

New Zealand vs India: తొలి మ్యాచ్ వర్షార్పణం !.. ఒక్క బంతి కూడా పడకుండానే..

వెల్లింగ్టన్ : న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా (New Zealand vs India) 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షార్పణమయ్యింది. వరుణ దేవుడు కరుణ చూపకపోవడం వెల్లింగ్టన్ వేదికగా జరగాల్సిన ఈ మ్యాచ్‌లో కనీసం టాస్ కూడా పడలేదు. దాదాపు గంటన్నరపాటు నిరీక్షించినా తగ్గముఖం పట్టకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు. దీంతో కనీసం ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ తుడిచిపెట్టుకుపోయింది. కాగా మౌంట్ మంగనూయి వేదికగా ఆదివారం ఇరుజట్ల మధ్య రెండవ టీ20 జరగనుంది. వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటే ఈ మ్యాచ్ సజావుగా సాగే అవకాశాలు ఉంటాయి.

Updated Date - 2022-11-18T13:45:22+05:30 IST

Read more