Fashion : చలి చంపుతున్న చమక్కులో..

ABN , First Publish Date - 2022-12-06T23:53:33+05:30 IST

చలికాలం చిట్టి పొట్టి దుస్తులకు చెల్లుచీటీ రాయక తప్పదు. అలాగని ఒళ్లంతా కప్పి ఉంచే దుస్తులనూ దరించలేం. కానీ నిజానికి ఈ కాలంలో చలిని తప్పించుకుంటూ,

Fashion : చలి చంపుతున్న చమక్కులో..

చలికాలం చిట్టి పొట్టి దుస్తులకు చెల్లుచీటీ రాయక తప్పదు. అలాగని ఒళ్లంతా కప్పి ఉంచే దుస్తులనూ దరించలేం. కానీ నిజానికి ఈ కాలంలో చలిని తప్పించుకుంటూ, ఫ్యాషన్‌గా కనిపించే దుస్తులు ఉన్నాయి. ఆ వింటర్‌ వేర్‌ ఇదే!

లాంగ్‌ స్కర్ట్‌:

లేయర్స్‌తో కూడిన లాంగ్‌ స్కర్ట్స్‌ ఈ కాలంలో వెచ్చదనాన్ని అందించడంతో పాటు ఫ్యాషన్‌ లుక్‌నూ తెచ్చి పెడతాయి. కాబట్టి ఆకర్షణీయమైన రంగులతో కూడిన లాంగ్‌ స్కర్ట్స్‌ ఎంచుకోవాలి. వీటికి తగ్గట్టు పదాలకు ఫ్లాట్స్‌ ధరించాలి.

జాకెట్‌: లెదర్‌, ఊల్‌, కాటన్‌.. మెటీరియల్‌ ఏదైనా ధరించిన దుస్తులకు నప్పే జాకెట్‌ ఎంచుకుంటే వెచ్చగా, ఆకర్షణీయంగా కనిపించవచ్చు. అయితే ధరించే జాకెట్‌ షోల్డర్‌ లెంగ్త్‌ సరిగా ఉండేలా చూసుకోవాలి. భుజాలు దిగకుండా, ఒంటికి హత్తుకుపోయే జాకెట్‌ చూడముచ్చటగా ఉంటుంది. బూట్లు, లేదా వెడ్జెస్‌ జాకెట్‌కు చక్కగా మ్యాచ్‌ అవుతాయి.

స్కార్ఫ్‌: స్కార్ఫ్‌లు చలి నుంచి వెచ్చదనాన్నీ, సౌకర్యాన్నీ అందిస్తాయి. కాబట్టి చలి కాలం చున్నీలా స్కార్ఫ్‌ను మెడలో వేలాడదీసుకోవచ్చు. మెడ చుట్టూ చుట్టి ఫ్యాషన్‌ ట్రెండ్‌నూ సృష్టించవచ్చు.

స్వెటర్‌: చలి దుస్తులంటే గుర్తుకొచ్చేవి స్వెటర్లే! అయితే సౌకర్యానికి పెద్ద పీట వేస్తూ, దుస్తుల్లో కలిసిపోయినట్టు కనిపించే స్వెటర్స్‌ అందుబాటులో ఉంటున్నాయి. అలాంటి వాటిని ఎంచుకుంటే వెచ్చదనంతో పాటు ఫ్యాషనబుల్‌గా కనిపించడం ఖాయం.

స్టోల్‌: ఇది కలకాలం కొనసాగే ఫ్యాషన్‌. కాబట్టి మందంగా ఉండే ఊలుతో తయారైన స్టోల్‌ ఎంచుకోవాలి.

Updated Date - 2022-12-10T00:28:44+05:30 IST