Update Chrome : అప్డేట్ క్రోమ్ 108
ABN , First Publish Date - 2022-12-16T23:21:33+05:30 IST
గూగుల్ క్రోమ్ అత్యంత ఆదరణ పొందిన వెబ్ బ్రౌజర్. అయితే కొన్ని సమస్యల పరిష్కారానికి తోడు బ్రౌజర్ పర్ఫార్మెన్స్‌ను మెరుగుపర్చేందుకు అప్డేట్ ‘క్రోమ్ 108’ని విడుదల
గూగుల్ క్రోమ్ అత్యంత ఆదరణ పొందిన వెబ్ బ్రౌజర్. అయితే కొన్ని సమస్యల పరిష్కారానికి తోడు బ్రౌజర్ పర్ఫార్మెన్స్‌ను మెరుగుపర్చేందుకు అప్డేట్ ‘క్రోమ్ 108’ని విడుదల చేసింది. రిసోర్స్ మేనేజ్‌మెంట్, పవర్ మేనేజ్‌మెంట్ కోసం దీంతో రెండు ఫీచర్లను ఉంచింది. ఈ సందర్భంలో బ్రౌజర్ పర్ఫార్మెన్స్‌ను మెరుగుపర్చేందుకు కొన్ని టిప్స్‌ను సూచించింది. వాటిని ప్రయత్నించి చూడాలని కూడా చెబుతోంది.
గూగుల్ క్రోమ్‌లో లేటెస్ట్ వెర్షన్ అప్డేట్ అయ్యిందా లేదా అన్నది మొదట సరిచూసుకోవాలి. చివరి అప్డేట్ మాత్రమే కొత్త ఫీచర్లతో ఉంటుంది. బగ్ ఫిక్సింగ్‌తో పాటు పర్మాఫార్మెన్స్ మెరుగుదల తదితరాలు సమకూరుతాయి.
మిడ్ రేంజ్ మెషీన్ అదీ 4జీబీ లేదా 8జీబీ ర్యామ్ ఉంటే ట్యాబ్స్ అత్యంత ఎక్కువగా సిస్టమ్ రిసోర్సులను కన్జ్యూమ్ చేస్తాయి. యూజ్ చేయని ట్యాబ్స్‌ని క్లోజ్ చేయాలి. అందుకు ప్రత్యామ్నాయంగా కొత్త అప్డేట్‌తో వచ్చిన మెమరీ సేవర్ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఇది ఇనాక్టివ్ ట్యాబ్స్‌ను స్లీప్‌లో ఉంచుతుంది. అలా మెమరీని కాపాడుతుంది.
అనవసరమైన ప్రాసెస్‌లతో కూడా ఇబ్బంది తలెత్తు తాయి. అనవసరమైన ఎక్స్‌టెన్షన్స్, టాస్క్‌లు ఎక్కువగా నేపథ్యంలో రన్ అవుతాయి. సిస్టమ్ రిసోర్సులనుతింటాయి.
క్రోమ్‌లో యాక్షన్ ప్రిడిక్షన్స్ ఉన్నాయి. వెబ్ పేజీలు త్వరగా ఓపెన్ అయ్యేందుకు ఆవి తోడ్పడతాయి. అందుకోసం క్రోమ్ సెట్టింగ్స్ - ప్రైవసీ అండ్ సెక్యూరిటీ - కుకీస్ అండ్ అదర్ సైట డేటా - టర్న్ ప్రీలోడ్ పేజెస్ ఫర్ ఫాస్టర్ బ్రౌజింగ్ అండ్ సెర్చింగ్ చేయాలి.
మరొక ఫీచర్ ఎనర్జీ సేవర్ మోడ్. బెటర్ పర్ఫార్మెన్స్ కు తోడు బ్యాటరీ లైఫ్ మెరుగుదలకు ఇది తోడ్పడుతుంది.