Twitter Blue Plus : ట్విటర్‌ బ్లూ ప్లస్‌....!

ABN , First Publish Date - 2022-12-16T23:38:26+05:30 IST

పలు ఫీచర్ల సమాహారమైన ‘ట్విటర్‌ బ్లూ’ని ట్విటర్‌ విడుదల చేసింది. ఇది సబ్‌స్ర్కిప్షన్‌ సర్వీస్‌. దీనికి తోడు పలు కలర్డ్‌ వెరిఫైడ్‌ అకౌంట్స్‌ను కూడా రిలీజ్‌ చేసింది. లేబుల్‌ లేదంటే ట్విటర్‌

Twitter Blue Plus : ట్విటర్‌ బ్లూ ప్లస్‌....!

పలు ఫీచర్ల సమాహారమైన ‘ట్విటర్‌ బ్లూ’ని ట్విటర్‌ విడుదల చేసింది. ఇది సబ్‌స్ర్కిప్షన్‌ సర్వీస్‌. దీనికి తోడు పలు కలర్డ్‌ వెరిఫైడ్‌ అకౌంట్స్‌ను కూడా రిలీజ్‌ చేసింది. లేబుల్‌ లేదంటే ట్విటర్‌ అప్లయిడ్‌ ప్రొఫైల్‌ లేబుల్స్‌ అని వీటిని అంటారు. వేర్వేరు అకౌంట్స్‌ను తెలియజేసేందుకు లేబుల్స్‌, బ్యాడ్జస్‌ను సపోర్ట్‌ పేజీలో ఉంచింది. యూజర్‌ యాక్షన్‌తో కొన్ని, ట్విటర్‌ అప్లయ్‌ చేసేవి కొన్ని ఇందులో ఉంటాయి. అకౌంట్‌కు పక్కన బ్లూ చెక్‌మార్కు ఉంటే ట్విటర్‌ మునుపటి ప్రమాణాలకు లోబడి వెరిఫై అయినట్టు పరిగణించాలి. అలాగే ట్విటర్‌ కొత్త ‘ట్విటర్‌ బ్లూ సబ్‌స్ర్కిప్షన్‌ ప్రొడక్ట్‌’ అని కూడా భావించాలి. బ్లూ చెక్‌కు అర్హత పొందింది అంటే చాలు, రెవ్యూకి వెళ్ళే ప్రసక్తే ఉండదు. పక్కా చెకింగ్‌ పూర్తయినట్లే. గోల్డ్‌ చెక్‌ మార్క్‌ లేదంటే ట్విటర్‌ బ్లూ పూర్తిగా దాన్ని అధికారిక బిజినెస్‌ అకౌంట్‌గా భావించాలి. అడుగున అఫీషియల్‌ అని కనిపిస్తే దానిని ప్రభుత్వ అకౌంట్‌గా భావించాలి. ఎన్నికైన, అధికారికంగా నియమితులైన వ్యక్తులకు తోడు కొన్ని రాజకీయ పార్టీలు, కమర్షియల్‌ కంపెనీలు, బిజినెస్‌ పార్టనర్లు, ప్రముఖులు మీడియా సంస్థలు కూడా వస్తాయి. స్టేట్‌ అనుబంధ మీడియా లేబుల్స్‌, గవర్నమెంట్‌ లేబుల్స్‌ మరో కేటగిరి. ఇది ఒక రకంగా సబ్‌ కేటగిరి. దీనికోసం చిన్న ఐకాన్‌ లేదంటే ఫ్లాగ్‌తో వీటిని వేరు చేశారు. ఆటోమేటెడ్‌ లేదా బాట్‌ లేబుల్స్‌ కేటగిరి కూడా ఉంది. అంటే దీన్ని మానవమాత్రులు రన్‌ చేస్తున్న అకౌంట్‌ కాదని అర్థం.

Updated Date - 2022-12-16T23:38:28+05:30 IST