Infertility : సంతాన సాఫల్యానికి సరైన మార్గం

ABN , First Publish Date - 2022-12-19T23:28:43+05:30 IST

భార్యాభర్తలు ఒక ఏడాది పాటు ఎటువంటి గర్భనిరోధక సాధనాలు వాడకుండా వైవాహిక జీవితం గడిపినప్పటికీ సంతానం కలగకపోతే దానిని సంతానలేమి సమస్యగా భావించాల్సి ఉంటుంది. సంతానలేమికీ, స్త్రీపురుషులిద్దర్లో కారణాలు సమంగా ఉంటాయి.

Infertility : సంతాన సాఫల్యానికి సరైన మార్గం

భార్యాభర్తలు ఒక ఏడాది పాటు ఎటువంటి గర్భనిరోధక సాధనాలు వాడకుండా వైవాహిక జీవితం గడిపినప్పటికీ సంతానం కలగకపోతే దానిని సంతానలేమి సమస్యగా భావించాల్సి ఉంటుంది. సంతానలేమికీ, స్త్రీపురుషులిద్దర్లో కారణాలు సమంగా ఉంటాయి.

మహిళల్లో కారణాలు

పిసిఒడి: ఈ పాలీసిస్టిక్‌ ఒవేరియన్‌ సిండ్రోమ్‌ వల్ల హార్మోన్ల సమస్యలు తలెత్తి అండాలు సక్రమంగా విడుదల కావు. ఫలితంగా నెలసరి క్రమం తప్పుతుంది.

ఎండోమెట్రియాసిస్‌: గర్భాశయం లోపలి పొరల్లో కనిపించవలసిన కణాలు గర్భాశయం వెలుపల అసహజంగా పెరుగుతాయి. దాంతో నెలసరి సమయంలో అధిక రక్తస్రావం కనిపిస్తుంది. ఫలితంగా ఇన్‌ఫెక్షన్లు పెరిగి అండాలు బలహీనపడాయి.

ట్యూబుల్లో అడ్డంకులు: అండం శుక్రకణ ఫలదీకరణకు ఉపయోగపడే ఈ ట్యూబుల్లో అడ్డంకులు ఏర్పడడం వల్ల అండం, శుక్రకణాల ఫలదీకరణ జరగదు. ఫలితంగా సంతానలేమి సమస్య తలెత్తుతుంది.

ఫైబ్రాయిడ్స్‌: సబ్‌ మ్యూకస్‌ ఫైబ్రాయిడ్స్‌ ఏర్పడినప్పుడు అబార్షన్‌ జరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ సబ్‌ సెరోసల్‌లో ఫైబ్రాయిడ్స్‌ ఉంటే పిండం ఎదుగుదలకు ఎటువంటి ఆటంకాలు ఉండవు. కాబట్టి ఫైబ్రాయిడ్స్‌ ఎక్కడ ఉన్నాయనేది కీలకం.

పురుషుల్లో కారణాలు

అజూస్పెర్మియా: వీర్యంలో వీర్యకణాలు ఏమాత్రం లేకపోవడాన్ని అజూస్పెర్మియా అంటారు. హార్మోన్ల అసమతౌల్యమే కాకుండా ఇతరత్రా కారణాలతో ఈ సమస్య తలెత్తుతుంది.

అలిగోస్పెర్మియా: ఈ సమస్యలో వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉంటుంది. దీనికి వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు ఒక కారణం. అధిక ఉష్ణోగ్రత దగ్గర పని చేసేవారిలో కూడా స్పెర్మ్‌ కౌంట్‌ పడిపోతూ ఉంటుంది.

అస్థినోస్పెర్మియా: వీర్యకణాల మోర్టాలిటీ తక్కువగా ఉంటుంది. ఇన్‌ఫెక్షన్లు రావడంతో ఈ సమస్య తలెత్తుతుంది.

పుట్టుకతో లోపాలు: వృషణాలు అభివృద్ధి చెందకపోవడం, వృషణాలకు దెబ్బలు తగలడం ప్రధాన కారణాలు.

మెడనొప్పి

మెడ, వెన్నుపూసలోని మార్పుల వల్ల నరాల మీద ఒత్తిడి పెరిగి ఈ సమస్య మొదలవుతుంది. ఎముకల అరుగుదల, కార్టిలేజ్‌ తగ్గడం, ఎముకల దారుఢ్యం, సాంద్రత తగ్గడం కారణాలు. మెడ తిప్పలేకపోవడం, చేతులు లాగడం లాంటి లక్షణాలు వేధిస్తాయి. మెడ నుంచి భుజాలు, చేతులకు నొప్పి, తిమ్ముర్లు వ్యాపిస్తాయి.

హోమియో చికిత్స: హోమియో చికిత్సలో కండరాలు బలపడే విధంగా చేసి, శాశ్వతంగా సమస్యను పరిష్కరించవచ్చు.

భుజం నొప్పి

గాయాల బారిన పడి లిగమెంట్‌ చిరగడంతో భుజం కీలు పట్టు తప్పుతుంది. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే, కీలు మొత్తం అరిగిపోతుంది. కొందర్లో లిగమెంట్స్‌ చుట్టూ ఉండే కండరాలు బిగుసుకుపోతాయి. ఇంకొందర్లో రెండు ఎముకల మధ్య గ్యాప్‌ తగ్గిపోతుంది. దాంతో ఎముకలు ఒరుసుకుని నొప్పి మొదలవుతుంది.

హోమియో వైద్యం: ఏ కారణంతో భుజం నొప్పి మొదలైనా హోమియో మందులు

పరిష్కారం చూపుతాయి. నొప్పి నివారణ మాత్రలు తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తాయి.

కానీ హోమియో వైద్యం శాశ్వత పరిష్కారాన్ని చూపుతుంది.

డాక్టర్‌ రవి కిరణ్‌

MD,M.Sc (Psych),P.G (Virology)LONDON

గోల్డ్‌ మెడల్‌ ఫర్‌ ఎక్సెలెన్సీ ఇన్‌ మెడిసన్‌,

మాస్టర్స్‌ హోమియోపతి.

ఆదిలాబాద్‌, అమీర్‌పేట్‌, కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్‌, సికింద్రాబాద్‌, విజయవాడ, కరీంనగర్‌, విశాఖపట్నం, తిరుపతి, హన్మకొండ, రాజమండ్రి, గుంటూరు.

ఫోన్‌ నెంబరు: 7842108108,

040- 48106108

Updated Date - 2022-12-19T23:28:45+05:30 IST