Personal update : ఇన్‌స్టా నుంచి ‘నోట్స్’ పర్సనల్ అప్‌డేట్
ABN , First Publish Date - 2022-12-16T23:43:15+05:30 IST
ఇన్‌స్టాగ్రామ్ తాజా అప్డేట్‌తో యూజర్లు ఒకరికొకరు మరింత సులువుగా కనెక్ట్ కావచ్చు. కొత్త ఫీచర్ ‘నోట్స్’తో తమ ఆలోచనలను టెక్స్ట్, ఎమోజీ రూపంలో షేర్ చేసుకోవచ్చు.
ఇన్‌స్టాగ్రామ్ తాజా అప్డేట్‌తో యూజర్లు ఒకరికొకరు మరింత సులువుగా కనెక్ట్ కావచ్చు. కొత్త ఫీచర్ ‘నోట్స్’తో తమ ఆలోచనలను టెక్స్ట్, ఎమోజీ రూపంలో షేర్ చేసుకోవచ్చు. అయితే అంతా కలిపి 60 కేరక్టర్లకే పరిమితం కావాలి. ఇన్‌బాక్స్ టాప్‌లో ఉంటుంది. అలాగే పంపిన మెసేజ్ క్లోజ్ ఫ్రెండ్స్ ఇన్‌బాక్స్‌లో 24 గంటల సేపు ఉంటుంది. సమాధానాలు డీఎంలు రూపంలో ఇన్‌బాక్స్‌కు చేరుతాయి.
క్యాండిడ్ స్టోరీస్ మరొకటి. ఇందులో యూజర్ల సొంత సందేశాలు ఉంటాయి. సన్నిహిత మిత్రులతో షేర్ చేసుకోవచ్చు. అలాగే వారు కూడా తమ సొంత మెసేజ్‌లు షేర్ చేస్తారు. స్టోరీస్ కెమెరా నుంచి వీటిని యూజర్ల క్యాప్చర్ చేసుకోవచ్చు.
గ్రూప్ ప్రొఫైల్స్ విషయానికి వస్తే, ఇది కూడా స్నేహితులు, సన్నిహితుల కోసం ఉద్దేశించిందే. ఈ ప్రొఫైల్ కింద పంపిన పోస్టులు సంబంధితులకే తప్ప ఫాలోవర్లు అందరికీ చేరదు. దీనికోసం +ని టాప్ చేసి గ్రూప్ ప్రొఫైల్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలి.
పరస్పర ఆసక్తులను అనుసరించి షేర్ చేసుకునేందుకు ఉద్దేశించినది కొలాబిరేటివ్ కలెక్షన్స్. గ్రూప్‌లో కొద్ది మందితో లేదంటే వన్ టు వన్ అంటూ పరిమితంగా పోస్టులను షేర్ చేసుకోవచ్చు