Jai Bheem : జై భీమ్‌.. మరోసారి!

ABN , First Publish Date - 2022-12-03T23:37:31+05:30 IST

యాక్షన్‌, కామెడీ, థ్రిల్లర్‌, హారర్‌ చిత్రాలకు సీక్వెల్స్‌ రావడం, ఫ్రాంచైజీలు ఉండడం సాధారణమే. కానీ ఎమోషనల్‌ డ్రామా చిత్రాలకు కూడా పార్ట్‌ 2, 3 ఉండడం అరుదుగా జరిగే విషయం

Jai Bheem : జై భీమ్‌.. మరోసారి!

యాక్షన్‌, కామెడీ, థ్రిల్లర్‌, హారర్‌ చిత్రాలకు సీక్వెల్స్‌ రావడం, ఫ్రాంచైజీలు ఉండడం సాధారణమే. కానీ ఎమోషనల్‌ డ్రామా చిత్రాలకు కూడా పార్ట్‌ 2, 3 ఉండడం అరుదుగా జరిగే విషయం. ‘జై భీమ్‌’ అలాంటి ఎమోషనల్‌ డ్రామానే. చంద్రు అనే ఓ న్యాయవాది కథ ‘జై భీమ్‌’. సూర్య కీలకపాత్ర పోషించిన ఈ చిత్రం ప్రేక్షకుల మన్ననలు పొందింది. విమర్శకుల మనసుల్ని గెలుచుకొంది. అవార్డులూ తెచ్చి పెట్టింది. ఈ సినిమాతో సూర్యపై గౌరవం రెట్టింపు అయ్యింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌ తీసుకురాబోతున్నారని తెలుస్తోంది. చంద్రు జీవితంలో.. తనకు ఎదురైన మరో కేసు వ్యవహారం.. ఈ సినిమాలో కనిపించనుందట. అయితే పార్ట్‌ 2లో సూర్య కనిపిస్తాడా, లేదా? అనేది తెలియాల్సివుంది. ఫ్రాంచైజీలకు హీరో మారడం కొత్తేం కాదు. తెలుగులో ‘హిట్‌’ విశ్వక్‌సేన్‌తో తీశారు. ‘హిట్‌ 2’కి వచ్చేసరికి అడవి శేష్‌ కనిపించాడు. ‘జై భీమ్‌ 2’లోనూ ఓ కొత్త హీరో వచ్చి చేరే అవకాశాలు ఉన్నాయని టాక్‌. ప్రస్తుతానికేతే ‘జై భీమ్‌’ సీక్వెల్‌కి సంబంధించిన స్ర్కిప్టు పనులు జరుగుతున్నాయి. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.

Updated Date - 2022-12-03T23:37:32+05:30 IST