Iphone Tips :చార్జింగ్‌ పెట్టి మర్చిపోతున్నారా ఉపాయం ఇదిగో

ABN , First Publish Date - 2022-12-16T23:23:44+05:30 IST

సాధారణంగా ఫోన్లు చార్జింగ్‌లో ఉంచి మర్చిపోతుంటాం. దీంతో ఫుల్‌ చార్జింగ్‌ అయినా అలాగే దానికి పవర్‌ పాస్‌ అవుతుంటుంది. ఈ కారణంగా కరెంట్‌ వృథా, బాటరీ లైఫ్‌

Iphone Tips :చార్జింగ్‌ పెట్టి మర్చిపోతున్నారా ఉపాయం ఇదిగో

సాధారణంగా ఫోన్లు చార్జింగ్‌లో ఉంచి మర్చిపోతుంటాం. దీంతో ఫుల్‌ చార్జింగ్‌ అయినా అలాగే దానికి పవర్‌ పాస్‌ అవుతుంటుంది. ఈ కారణంగా కరెంట్‌ వృథా, బాటరీ లైఫ్‌ తగ్గిపోవడం, కొన్ని సందర్భాల్లో బాటరీ పేలిపోయే అవకాశం కూడా ఉంది. దీనిని నివారించే మార్గం ఉంది. అదే చార్జింగ్‌ అలర్ట్‌. అయితే ఇది ఐఫోన్‌కు మాత్రమే పరిమితం. బ్యాటరీ చార్జింగ్‌ లెవెల్‌ 95 శాతానికి మించితే ‘టర్నాఫ్‌ ద చార్జ్‌’ అన్న వాయిస్‌ నోట్‌ వినిపిస్తుంది. అందుకోసం...

  • ఐఫోన్‌లో షార్ట్‌కట్స్‌ యాప్‌ని ఓపెన్‌ చేయాలి.

  • స్ర్కీన్‌పై అడుగున రైట్‌ కార్నర్‌లో ‘ఆటోమేషన్‌’ని టాప్‌ చేయాలి.

  • పేజీ ప్రత్యక్షం కాగానే రైట్‌ కార్నర్‌ టాప్‌లో ఉన్న + ఐకాన్‌ని టాప్‌ చేయాలి.

  • అప్పుడు న్యూ ఆటోమేషన్‌ స్ర్కీన్‌కి పేజీ రీడైరెక్ట్‌ అవుతుంది.

  • న్యూ ఆటోమేషన్‌ని టాప్‌, క్రియేట్‌ పర్సన్‌ ఆటోమేషన్‌ టాప్‌ చేయాలి.

  • న్యూ విండో కనిపించగానే, చార్జర్‌ ఆప్షన్‌ దగ్గరకు వెళ్ళాలి.

  • చార్జర్‌ ఆప్షన్‌ని టాప్‌ చేయగానే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి.

  • చార్జర్‌ ఈజ్‌ కనెక్టడ్‌, చార్జర్‌ ఈజ్‌ డిస్‌కనెక్టడ్‌లలో ఒకటి సెలెక్ట్‌ చేసుకోవాలి. చివరగా యాక్షన్‌ బటన్‌ని యాడ్‌ చేసుకోవాలి.

ఇవే కాకుండా యూజర్లకు మరికొన్ని షార్ట్‌కట్స్‌ను ఐఫోన్‌ ఆఫర్‌ చేస్తోంది. తెలియని వ్యక్తుల నుంచి కాల్‌ వచ్చినప్పుడు సైలెంట్‌లో పెట్టుకోవచ్చు. అందుకోసం సెట్టింగ్స్‌ - ఫోన్‌ - సైలెన్స్‌ అన్‌నోన్‌ కాలర్స్‌తో సరిపోతుంది. ఐఔస్‌ 16.2తో పనిచేసే ఐఫోన్లకోసం ప్రపంచవ్యాప్తంగా ఐక్లౌడ్‌కు ఎన్‌క్రిప్షన్‌, కొత్త యాపిల్‌ మ్యూజిక్‌(కచేరి), వైట్‌బోర్డ్‌ యాప్‌లను పరిచయం చేస్తోంది. ఈ అప్డేట్‌తోనే మన దేశంలో 5జీ కనెక్టివిటీని ఐఫోన్‌ యూజర్లు పొందవచ్చు.

Updated Date - 2022-12-16T23:23:45+05:30 IST