Google Help : క్రిమికారక వ్యాధుల నివారణకు గూగుల్ హెల్ప్
ABN , First Publish Date - 2022-12-16T23:31:34+05:30 IST
క్రిమికీటకాదులతో సంక్రమించే వ్యాధులతో ఏటా లక్షల మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ వ్యాధులపై యుద్ధానికి గూగుల్ సరికొత్త టెక్నాలజీని అభివృద్ధిపరిచే పనిలో ఉంది.
క్రిమికీటకాదులతో సంక్రమించే వ్యాధులతో ఏటా లక్షల మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ వ్యాధులపై యుద్ధానికి గూగుల్ సరికొత్త టెక్నాలజీని అభివృద్ధిపరిచే పనిలో ఉంది. అందుకు గూగుల్ బుక్స్ తవ్వితీసిన డేటాను ఉపయోగించుకుంటోంది. వాసనను పసిగట్టే విషయంలో కొత్తగా రూపొందించిన సెన్సరీ మ్యాప్‌ను కూడా కలుపుకొంటోంది. మనుషులు మాదిరిగానే దోమలు కూడా శ్వాసిస్తాయని ఇటీవల శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. వాస్తవానికి ఈ ఫైండింగ్ గూగుల్ బృహత్ యత్నానికి నాంది పలికింది. గూగుల్ బ్రెయిన్ మాజీ రిసెర్చర్ ఒకరు చెప్పిన దాని ప్రకారం, కంప్యూటర్లు వాసన పసిగట్టడంపై ఆయన బృందం పనిచేస్తోంది. న్యూరల్ నెట్వర్క్స్ ప్రిడిక్షన్స్‌ను సమీక్షిస్తున్నప్పుడు మనుషులు మాదిరిగా వాసనను ఏ మాలిక్యుల్స్(అణువులు) పసిగడతాయన్నది కనుగొన్నాం. సరిగ్గా కీటకాల్లోని మెదడులో కూడా అవే మాలిక్యూల్స్ వాసనను పసిగడుతున్నాయి.
ఈ అంచనాలతో తాము ముందుకు వెళుతున్నట్టు ఆ రీసెర్చర్ వెల్లడించారు. గూగుల్ బ్రెయిన్ టీమ్ ఇదే సందర్భంలో వాసనను పసిగట్టే విషయంలో కంప్యూటర్లకు శిక్షణ ఇస్తే, అవి దోమలను తిప్పిగొడతాయి. అలా సురక్షితమైన, చౌకగా ప్రభావపరిచే వికర్షకాలను పట్టుకోవచ్చని తద్వారా క్రిములతో వచ్చే వ్యాధులను నివారించవచ్చని తలపోస్తున్నారు. ఈ సందర్భంలో మోడల్స్(కంప్యూటర్స్) కోసం అవసరమైన డేటా సవాలుగా మారింది. సరిగ్గా ఆ సమయంలో సంబంధిత పరిశోధనను ఇప్పటికే యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ పూర్తి చేసిందని ఆ టీమ్ కనుగొంది. ఇప్పుడు ఆ సమాచారాన్ని ఒక క్రమ పద్ధతిలోకి తీసుకువచ్చే పనిలో ఉంది.