Google Calendar : గుల్‌ క్యాలెండర్‌

ABN , First Publish Date - 2022-12-10T00:11:19+05:30 IST

గూగుల్‌ సరికొత్త వర్క్‌ క్యాలెండర్‌కు శ్రీకారం చుట్టింది. జీమెయిల్‌ యూజర్లకు ఉద్దేశించి చాట్స్‌(పర్సనల్‌) స్పేసెస్‌(గ్రూప్‌ చాట్స్‌)

 Google Calendar : గుల్‌ క్యాలెండర్‌

గూగుల్‌ సరికొత్త వర్క్‌ క్యాలెండర్‌కు శ్రీకారం చుట్టింది. జీమెయిల్‌ యూజర్లకు ఉద్దేశించి చాట్స్‌(పర్సనల్‌) స్పేసెస్‌(గ్రూప్‌ చాట్స్‌) ద్వారా అంతా కలిసి పనిచేసుకునే అవకాశం కల్పిస్తోంది. వీటితో కుటుంబ సభ్యుల నుంచి స్నేహితులు, సహోద్యోగుల వరకు కలిసికట్టుగా వర్క్‌ చేసుకోవచ్చు. ఇది డిఫాల్ట్‌ సెట్టింగ్‌. ఆ కారణంగా యూజర్‌కు చాట్‌ రెసిపెంట్లకు మధ్య మాత్రమే ఈ సౌలభ్యం వీలవుతుంది. అయితే ఒక ఈవెంట్‌ను క్రియేట్‌ చేస్తున్న సందర్భంలో అతిథులను కలుపుకోవచ్చు. ఇదెలాగంటే...

  • స్మార్ట్‌ఫోన్‌ లేదంటే కంప్యూటర్‌లో జీమెయిల్‌ యాప్‌ని ఓపెన్‌ చేసుకోవాలి.

  • చాట్‌ లేదా స్పేసెస్‌ కాన్వర్సేషన్‌ వద్దకు వెళ్ళి కేలండర్‌ ఈవెంట్‌ను క్రియేట్‌ చేసుకోవాలి.

  • లెఫ్ట్‌ కార్నర్‌ అడుగున ఉన్న ప్లస్‌ ఐకాన్‌ను టాప్‌ చేయాలి.

  • మెనూలో ఉండే కేలండర్‌ ఇన్‌వైట్‌ని సెలెక్టు చేసుకోవాలి.

  • స్ర్కీన్‌ రైట్‌ పానెల్‌లో గూగుల్‌ క్యాలెండర్‌ ఉంటుంది. అక్కడ తేదీ, సమయాన్ని సెలెక్ట్‌ చేసుకోవాలి.

  • మరింత మందిని కావాలని అనుకుంటే ఈవెంట్‌కు అతిఽథులుగా చేర్చుకోవచ్చు.

  • సేవ్‌ అండ్‌ షేర్‌ బటన్‌ని హిట్‌ చేస్తే చాలు, ఆహ్వానించిన అతిథులతో కలిపి ఈవెంట్‌ క్రియేట్‌ అవుతుంది.

Updated Date - 2022-12-10T00:11:20+05:30 IST