Malicious Files : రోజూ నాలుగు లక్షల మాలాసియస్‌ ఫైల్స్‌

ABN , First Publish Date - 2022-12-16T23:19:22+05:30 IST

రోజూ సగటున నాలుగు లక్షల మాలాసియ్‌స(ద్వేషపూరిత) ఫైల్స్‌ పంపిణి అవుతున్నాయి. గడచిన పదినెలల రికార్డును పరిశీలిస్తే, అంతకుమునుపు సంవత్సరంతో

Malicious Files : రోజూ నాలుగు లక్షల మాలాసియస్‌ ఫైల్స్‌

రోజూ సగటున నాలుగు లక్షల మాలాసియ్‌స(ద్వేషపూరిత) ఫైల్స్‌ పంపిణి అవుతున్నాయి. గడచిన పదినెలల రికార్డును పరిశీలిస్తే, అంతకుమునుపు సంవత్సరంతో పోల్చుకుంటే అయిదు శాతం మేర ఈ ఫైల్స్‌ దాడి పెరిగింది. కాస్పర్‌స్కై సెక్యూరిటీ సిస్టమ్‌ వెల్లడించిన వివరాల ప్రకారం మొత్తమ్మీద 2022లో 122 మిలియన్లు అంటే గత ఏడాది కంటే ఆరు మిలియన్లు ఎక్కువగా మాలాసియస్‌ ఫైల్స్‌ను కనుగొన్నారు. రాన్సమ్‌వేర్‌ 181 శాతం, డౌన్‌లోడర్స్‌ పరంగా 142 శాతం మేర పెరుగుదలను ఈ సందర్భంలో రిసెర్చర్లు కనుగొన్నారు. ఎక్కువగా విండోస్‌ ఈ అటాక్స్‌కు గురవుతున్నాయి. సగటున ఇవి మూడు లక్షల ఇరవై వేలుగా నమోదైంది. ఒక్క ఆండ్రాయిడ్‌ ప్లాట్‌ఫారమ్‌పైనే ఈ అటాక్స్‌ పది శాతం పెరిగింది. హ్యార్లీ, ట్రియడా ట్రోజన్‌ క్యాంపైన్స్‌ ద్వారా ఆండ్రాయిడ్‌ యూజర్లు సైబర్‌ క్రిమినల్స్‌ పాలిట పడుతుండటం గమనార్హం.

Updated Date - 2022-12-16T23:19:24+05:30 IST