Tea with Cheese : ‘టీ’తో చీజ్‌ ఇరానీ టీ తాగుతూ,

ABN , First Publish Date - 2022-11-23T23:24:25+05:30 IST

ఉస్మానియా బిస్కెట్లు తినడం మనకు అలవాటు. కానీ టీ విత్‌ చీజ్‌ ఎప్పుడైనా ట్రై చేశారా? ఆస్వాదనకే కాదు ఆరోగ్యానికీ చీజ్‌ అండ్‌ టీ పెయిరింగ్‌ సూపర్‌ అంటున్నారు బ్రూస్‌

Tea with Cheese : ‘టీ’తో చీజ్‌ ఇరానీ టీ తాగుతూ,
సీఈఓ విద్యాలత వల్లభనేని

ఉస్మానియా బిస్కెట్లు తినడం మనకు అలవాటు. కానీ టీ విత్‌ చీజ్‌ ఎప్పుడైనా ట్రై చేశారా? ఆస్వాదనకే కాదు ఆరోగ్యానికీ చీజ్‌ అండ్‌ టీ పెయిరింగ్‌ సూపర్‌ అంటున్నారు బ్రూస్‌ అండ్‌ బ్లెండ్స్‌ సీఈఓ విద్యాలత వల్లభనేని! ఆవిడ ‘నవ్య’తో తన సరికొత్త టీ విత్‌ చీజ్‌ కాన్సె్‌ప్టను పంచుకున్నారిలా...

‘‘చీజ్‌ మన సంస్కృతిలో భాగం కాదు. ఫుడ్‌ అండ్‌ టీ పెయిరింగ్‌ కూడా మనకు కొత్త విషయమే! కానీ విదేశాల్లో ఇది సర్వసాధారణం. అక్కడ వైన్‌తో పాటు చీజ్‌ తినడం ఆనవాయితీ. వైట్‌ టీతో చీజ్‌ కేక్స్‌ చాలా బాగుంటాయి. అలాగే డార్క్‌ చాక్లెట్‌, బ్లాక్‌ టీ కూడా అద్భుతమైన కాంబినేషన్‌. అలాగే టీ విత్‌ చీజ్‌ కూడా! అయితే ఏ టీతో ఎలాంటి చీజ్‌ జోడించాలనేది తెలుసుకుని ఆస్వాదిస్తే, ఆ రెండింటి కాంబినేషన్‌లో ఉండే మజా తెలిసొస్తుంది. మధురమైన ఆ చాయ్‌ చీజ్‌ కాన్సెప్ట్‌ను మన తెలుగు వారికీ పరిచయం చేయాలనుకున్నాను. కాబట్టే బ్రూస్‌ అండ్‌ బ్లెండ్స్‌ కెఫెలో ఈ వెరైటీ కాంబినేషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాను.’’

అదే సరిజోడి

విదేశాల్లో పలు రకాల చీజ్‌లు తయారవుతూ ఉంటాయి. కానీ మనకిక్కడ దొరికే చీజ్‌ వెరైటీలను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. అయితే మనకు దొరికే చీజ్‌లతో పాటు విదేశాలకే పరిమితమైన చీజ్‌లను కూడా టీలతో మేళవించి అందించే ప్రయత్నం ఎందుకు చేయకూడదు అనే ఆలోచనతో కొన్ని కాంబినేషన్లను రూపొందించాను. మొరాకన్‌ మింట్‌ టీతో క్రీమ్‌ చీజ్‌ లేదా మస్కారాపోన్‌ చీజ్‌, సిల్వర్‌నీడిల్‌ వైట్‌ టీతో మోజరెల్లా చీజ్‌ లేదా బురెట్టా చీజ్‌, ఊలాంగ్‌ టీతో ఫెటా చీజ్‌ లేదా ఏదైనా ఉప్పని చీజ్‌, గ్రీన్‌ టీతో చెడ్డార్‌ చీజ్‌, బ్లాక్‌ టీతో పర్మెసాన్‌ చీజ్‌ లేదా బ్లూ చీజ్‌.. ఇలా టీ, చీజ్‌లను కలిపి తీసుకోవచ్చు.

బిస్కెట్ల కంటే చీజ్‌ ఆరోగ్యకరం

చీజ్‌లో ఎక్కువ క్యాలరీలుంటాయి కాబట్టి పరిమితంగా తీసుకుంటూ ఉంటాం. కాబట్టి టీతో చీజ్‌ కలిపి తీసుకోవడం ఎంత వరకూ ఆరోగ్యకరం అనే అనుమానం రావచ్చు. నిజానికి సాధారణంగా మనం చాయ్‌ - బిస్కెట్‌ కాంబినేషన్‌ను ఇష్టపడుతూ ఉంటాం. బిస్కెట్లు మైదా పిండి, వెన్న, చక్కెరలతో తయారవుతాయి. వీటితో అందే క్యాలరీల కంటే చీజ్‌తో అందే క్యాలరీలు తక్కువ. పైగా చీజ్‌ ఆరోగ్యకరం కూడా! బిస్కెట్లు తిన్నట్టు చీజ్‌ను ఎక్కువ తినాలనుకున్నా తినలేం. కాబట్టి ఏమాత్రం సందేహించకుండా టీతో పాటు చీజ్‌ను కలిపి తినవచ్చు.

హై టీ

చిన్న చిన్న సభలు, సమావేశాల్లో హై టీ సర్వసాధారణమైపోయింది. ఇలాంటి చోట టీతో పాటు చీజ్‌ను కూడా టీ విత్‌ చీజ్‌ సెషన్స్‌ అందిస్తున్నాను. అక్కడకు వచ్చే అతిఽధులకు కాన్సె్‌ప్టను వివరిస్తూ సర్వ్‌ చేస్తాం లేదా వాటిని అందుబాటులో ఉంచి, ఎవరికి నచ్చినట్టు వారు ఆస్వాదించే వెసులుబాటును కూడా కల్పిస్తూ ఉంటాం.

బ్రూస్‌ అండ్‌ బ్లెండ్స్‌

రకరకాల టీలను ఆస్వాదించడానికి అనువైన ప్రదేశమిది. ఇక్కడ కాఫీ, టీలతో పాటు వాటితో పాటు తీసుకోగలిగే స్నాక్స్‌ కూడా ఉంటాయి. అలాగే ఇక్కడ టీ టేస్టింగ్‌ సెషన్లతో పాటు కాఫీ కప్పింగ్‌ సెషన్లను కూడా చేస్తున్నాం. ఈ సెషన్లలో పలు రకాల టీలను ఆస్వాదించవచ్చు. అలాగే టీ అండ్‌ చీజ్‌ పెయిరింగ్‌ కూడా ట్రై చేయవచ్చు. చీజ్‌ టీ పెయిరింగ్‌లో భాగంగా కొన్ని రకాల చీజ్‌లను అందిస్తున్నాం. అయితే బ్లూ చీజ్‌ లాంటివి ఖరీదైనవి కాబట్టి హై టీలలో ఆర్డర్‌ మేరకు అందిస్తున్నాం. అలాగే ఖరీదైన చీజ్‌లకు ప్రత్యామ్నాయ చీజ్‌లు కూడా అందుబాటులో ఉంటున్నాయి. కాబట్టి వాటితో పాటు టీని ఆస్వాదించే వెసులుబాటు కూడా కల్పిస్తున్నాం.

గోగుమళ్ల కవిత

Updated Date - 2022-11-23T23:24:27+05:30 IST