Scarlet Ibis : మీకు తెలుసా?

ABN , First Publish Date - 2022-12-16T23:50:00+05:30 IST

ఎర్రటి శరీరం, నల్లని ముక్కు ఉండే కొంగలాంటి ఈ పక్షి పేరు ‘స్కార్లెట్‌ ఐబిస్‌’. వీటి వింగ్‌ స్పాన్‌ 53.3 సెం.మీ. ఇవి ఆరెంజి, ఎరుపు, నలుపు, గోధుమరంగు రంగుల్లో కూడా ఉంటాయి.

Scarlet Ibis : మీకు తెలుసా?

  • ఎర్రటి శరీరం, నల్లని ముక్కు ఉండే కొంగలాంటి ఈ పక్షి పేరు ‘స్కార్లెట్‌ ఐబిస్‌’. వీటి వింగ్‌ స్పాన్‌ 53.3 సెం.మీ. ఇవి ఆరెంజి, ఎరుపు, నలుపు, గోధుమరంగు రంగుల్లో కూడా ఉంటాయి.

  • దక్షిణ అమెరికా, కరేబియన్‌ దీవులు, బ్రెజిల్‌ దేశాల్లో ఎక్కువగా కనపడతాయి.

  • మూడు నుంచి ఐదు గుడ్లు పెడతాయి. వీటి పొదిగే కాలం 19 రోజులనుంచి 23 రోజులు.

  • పురుగులు, మెత్తటి మట్టిలో ఉండే కీటకాలు, నీళ్లలోని చిన్న జీవులను తింటాయి. ఇవి నీళ్లు దగ్గర ఉండే ప్రాంతంలో ముఖ్యంగా గడ్డిపొదల్లో నివసిస్తాయి.

  • వీటి గుడ్లను దొంగలించటం, వేటాడటం వల్ల రోజు రోజుకీ ఈ జాతి పక్షులు తగ్గిపోతున్నాయి. ఇవి 20 ఏళ్లు జీవిస్తాయి. వీటి ఆనవాళ్లు అరవై మిలియన్ల సంవత్సరాల కాలంనాటిదని శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది.

Updated Date - 2022-12-16T23:50:01+05:30 IST