పీడీఎస్‌యూ మహాసభలు

ABN , First Publish Date - 2022-12-07T00:47:30+05:30 IST

సకల వర్గాలు కొట్లాడి సాధించుకున్న తెలంగాణ నేడు కొందరికి మాత్రమే బంగారు తెలంగాణగా మారింది. తెలంగాణ వస్తే కార్పొరేట్‌ విద్యా...

పీడీఎస్‌యూ మహాసభలు

సకల వర్గాలు కొట్లాడి సాధించుకున్న తెలంగాణ నేడు కొందరికి మాత్రమే బంగారు తెలంగాణగా మారింది. తెలంగాణ వస్తే కార్పొరేట్‌ విద్యా సంస్థలను స్వాధీనం చేసుకుంటామన్న కేసీఆర్ నేడు వాటినే ప్రత్యక్షంగా ప్రోత్సహిస్తున్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ కూడా ఫాసిస్టు విధానాలకు పాల్పడుతూ, నూతన జాతీయ విద్యా విధానం పేరుతో విద్యారంగాన్ని పూర్తిగా తమ గుప్పెట్లోకి తీసుకొని మతపరమైన అశాస్త్రీయ భావజాలాన్ని, పాఠ్యాంశాల్లోకి చొప్పిస్తున్నది. దేశవ్యాపితంగా కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో చేరే విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నది. పాలకవర్గాల ఈ ప్రజావ్యతిరేక విధానాలపై విద్యార్థి పోరాటాలను మరింత పదునెక్కించాల్సిన అవసరం ఉన్నది. ఈ నేపథ్యంలో పీడీఎస్‌యు తన 22వ మహాసభలను డిసెంబరు 7, 8 తేదీల్లో హైదరాబాదులో నిర్వహిస్తున్నది. మొదటి రోజు బహిరంగ సభలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య; విద్యావేత్త హరగోపాల్‌; సీపీఐ (యం.యల్‌) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు; నగర కార్యదర్శి యం. హన్మేష్‌ తదితరులు ప్రసంగిస్తారు. రెండవ రోజు వి.ఎస్‌.టి., బాగ్‌లింగంపల్లిలో జరిగే ప్రతినిధుల సభలో హేతువాద సంఘం జాతీయ కార్యదర్శి నరేంద్ర నాయక్‌ ప్రసంగిస్తారు.

బోయిన్‌పల్లి రాము

పీడీఎస్‌యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

Updated Date - 2022-12-07T00:47:33+05:30 IST