East Delhi Murder Case: భర్త శరీరాన్ని ముక్కలు చేయడానికి ముందు ఆ రాత్రి ఆమె ఏం చేసిందంటే?

ABN , First Publish Date - 2022-11-28T18:34:34+05:30 IST

మొదటి భర్తకు పుట్టిన కొడుకు సాయంతో రెండో భర్తను దారుణంగా హతమార్చిన భార్య, ఆపై అతడి మృతదేహాన్ని 10 ముక్కలుగా నరికి రిఫ్రిజిరేటర్‌లో దాచింది.

 East Delhi Murder Case: భర్త శరీరాన్ని ముక్కలు చేయడానికి ముందు ఆ రాత్రి ఆమె ఏం చేసిందంటే?

న్యూఢిల్లీ: దేశాన్ని కుదిపేసిన శ్రద్ధా వాకర్ (Shraddha Walkar) హత్యకేసు ఘటనను దేశం మర్చిపోకముందే తూర్పు ఢిల్లీ (East Delhi)లోనే జరిగిన మరో ఘటన సంచలనమైంది. ఈ రెండింటికీ పోలిక ఉండడం ఇప్పుడు సర్వత్ర చర్చనీయాంశమైంది. మొదటి భర్తకు పుట్టిన కొడుకు సాయంతో రెండో భర్తను దారుణంగా హతమార్చిన భార్య, ఆపై అతడి మృతదేహాన్ని 10 ముక్కలుగా నరికి రిఫ్రిజిరేటర్‌లో దాచింది. ఆ తర్వాత తల్లీకుమారులు ఇద్దరూ కలిసి వాటిని తీసుకెళ్లి ఓ నిర్జన ప్రదేశంలో పడేశారు. జూన్‌లోనే జరిగినట్టుగా తెలుస్తున్న ఈఘటన తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన మరోమారు సంచలనమైంది.

ఈ ఘటనకు సంబంధించి ఒళ్లు గగుర్పొడిచే 5 నిజాలు

* భర్త దాస్ తన తన బంగారు నగలు అమ్మేసి ఆ సొమ్మును మొదటి భార్యకు పంపడంతో పూనం కోపంతో రగిలిపోయింది. ఆ కోపం ప్రతీకారానికి దారితీసింది. మొదటి భర్త కుమారుడు దీపక్‌తో కలిసి దాస్‌ను హత్య చేయాలని పథకం రచించింది. దాస్ తన భార్యను ఇబ్బంది పెడుతుండడంతో హత్యకు తాను అంగీకరించినట్టు దీపక్ పోలీసులకు చెప్పాడు.

* దాస్‌ను జూన్‌లో హత్య చేశారు. తొలుత మద్యంలో మత్తుమందు కలిపి ఇచ్చారు. అది తాగిన దాస్ అపస్మారక స్థితిలోకి వెళ్లాక కత్తితో నరికి చంపారు. ఆ తర్వాత మృతదేహం నుంచి రక్తమంతా పోయే వరకు రాత్రంతా మృతదేహాన్ని అలాగే వదిలేశారు.

* రక్తమంతా పోయిన తర్వాత తెల్లవారుజామున మృతదేహాన్ని 10 ముక్కలుగా కోశారు. వాటిని పాలిథిన్ సంచుల్లో సర్ది ఫ్రిడ్జ్‌లో పెట్టారు. ఆ తర్వాత కొన్ని రోజులపాటు శరీర భాగాలను బయటకు తీసుకెళ్లి పడేసేవారు. పోలీసులు ఇప్పటి వరకు ఆరు భాగాలను స్వాధీనం చేసుకున్నారు. శరీర భాగాలు కనిపించిన ప్రాంతానికి పూనం, దీపక్ వెళ్లినట్టు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది.

* శరీర భాగాలను పూర్తిగా బయట పడేసిన తర్వాత దుర్వాసన రాకుండా ఇంటిని, ఫ్రిడ్జ్‌ను శుభ్రం చేసినట్టు నిందితులు పోలీసులకు తెలిపారు. దాస్ ఏమయ్యాడని అడిగిన వారికి తమకు చెప్పకుండా ఎటో వెళ్లిపోయాడని చెబుతూ బాధపడినట్టు నటించేవారు.

Updated Date - 2022-11-28T18:38:38+05:30 IST