Rupee: గణనీయంగా పడిపోయిన రూపాయి విలువ.. ఎంతంటే..

ABN , First Publish Date - 2022-11-23T17:32:35+05:30 IST

దేశీయ కరెన్సీ రూపాయి (Rupee fall) బుధవారం గణనీయంగా పతనమైంది.

Rupee: గణనీయంగా పడిపోయిన రూపాయి విలువ.. ఎంతంటే..

న్యూఢిల్లీ: దేశీయ కరెన్సీ రూపాయి (Rupee fall) బుధవారం గణనీయంగా పతనమైంది. ‘ఇంటర్‌బ్యాక్ ఫారెక్స్ మార్కెట్‌’పై 18 పైసలు మేర నష్టపోయి డాలర్ (Dollar) మారకంలో 81.85 స్థాయికి దిగజారింది. రూపాయి బుధవారం ఉదయం 81.81 వద్ద ఓపెన్ అయ్యింది. ఇంట్రాడే సెషన్‌లో గరిష్ఠం 81.74, కనిష్ఠం 81.87 స్థాయిలను తాకింది. చివరికి డాలర్ మారకంలో 81.85 వద్ద సెటిల్ అయ్యింది. దీంతో గత సెషన్ మంగళవారం ముగింపు 81.67తో పోల్చితే 18 పైసలు మేర నష్టపోయినట్టయ్యిందని బ్లూమ్‌బర్గ్ (Bloomberg) రిపోర్ట్ పేర్కొంది. యూఎస్ ఫెడ్ (US Fed) మినిట్స్ విడుదల సెంటిమెంట్ బలహీనమవ్వడం ప్రధాన కారణమైంది. మరోవైపు డాలర్ ఔట్‌ఫ్లో, 1 ఏడాది రూపీ ప్రీమియమ్స్ లాభాలు దశాబ్దకాల కనిష్ఠ స్థాయికి పడిపోవడం వంటి అంశాలు రూపీ పతనానికి కారణమయ్యాయి. మరోవైపు భవిష్యత్‌లో వడ్డీ రేట్ల పెంపు అంచనాలతోపాటు ఉత్పత్తి, సర్వీసుల పీఎంఐ డేటా అంచనాలకు తగ్గట్టులేకపోవడంతో గ్లోబల్ ఫారెక్స్ మార్కెట్ సెంటిమెంట్ బలహీనమైందనే విశ్లేషణలున్నాయి.

Updated Date - 2022-11-23T17:36:12+05:30 IST