Jayaprakash Narayana: మనం ప్రజాస్వామ్యంలో ఎక్కడో తప్పటడుగు వేస్తున్నాం

ABN , First Publish Date - 2022-10-28T17:54:51+05:30 IST

రిషిసునాక్ బ్రిటన్ ప్రధాని కావడం హర్షణీయమని లోక్‌సత్తా(loksatta party) అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ (Jayaprakash Narayana) అన్నారు.

Jayaprakash Narayana: మనం ప్రజాస్వామ్యంలో ఎక్కడో తప్పటడుగు వేస్తున్నాం
జయప్రకాశ్ నారాయణ, లోక్‌సత్తా అధ్యక్షుడు

విశాఖపట్నం: రిషిసునాక్ బ్రిటన్ ప్రధాని కావడం హర్షణీయమని లోక్‌సత్తా(loksatta party) అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ (Jayaprakash Narayana) అన్నారు. భారత సంతతికి చెందిన రిషిసునాక్ వయసు 42 ఏళ్లు ఉంటుందని, రిషిసునాక్ భారత్లో ఉన్నట్లయితే.. ఏ పార్టీ అయినా సీట్ ఇచ్చే అవకాశం ఉందా? అని జేపీ ప్రశ్నించారు. రిషి సునాక్ ఎన్నికల వ్యయం రూ.2 లక్షలు మాత్రమే అని జేపీ చెప్పారు. మనం ప్రజాస్వామ్యంలో ఎక్కడో తప్పటడుగు వేస్తున్నామని జేపీ అన్నారు. మునుగోడు ఉపఎన్నిక కేవలం ఏడాది పాలనకే అని, ఒక్క అసెంబ్లీ సీటుకే మూడు ప్రధాన పార్టీలు కలిసి రూ.400 కోట్లు ఖర్చు పెడుతున్నాయని జేపీ మండిపడ్డారు. ఎన్నికలు అంటే మనకు టీ20 మ్యాచ్ల్లా తయారయ్యాయని జేపీ విమర్శించారు. ఓట్లు వేసే ప్రజలు పల్లకీ మోసే బోయిలుగానే మిగిలిపోతున్నారని జేపీ ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2022-10-28T17:55:36+05:30 IST