రోజూ పాలతో చేసిన టీ తాగడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఇవే..!

పాలతో చేసిన టీని ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేషన్ కు దారి తీస్తుంది. దీని వల్ల తలనొప్పి వస్తుంది.

టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం పొడిబారడం, డీహేడ్రేషన్ కు లోను కావడం వల్ల మలం బయటకు వెళ్లడం కష్టం అవుతుంది.

టీ తాగడం వల్ల ఆందోళన లక్షణాలు మరింత తీవ్రం అవుతాయి. ఆందోళన సమస్యతో బాధపడేవారు  టీ తాగకపోవడం మంచిది.

టీలో ఉండే కెఫీన్ కడుపులో ఉబ్బరాన్ని మరింత పెంచుతుంది. పాలు జోడించిన టీ మరింత ఆమ్లంగా ఉంటుంది. ఇది ఉబ్బరాన్ని ఇంకా ఎక్కువ చేస్తుంది.

టీని అధికంగా తీసుకుంటే అందులో కెఫీన్ నిద్రా చక్రాన్ని దెబ్బతీస్తుంది.  ఇది క్రమంగా నిద్ర లేమికి దారితీస్తుంది.

పాలతో చేసిన టీని అధికంగా తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉండదు.