షుగర్ వ్యాధిగ్రస్తులూ.. ఈ పళ్లు తినకండి..!

పళ్లు తినడం ఆరోగ్యానికి మంచిదే కానీ, షుగర్ వ్యాధిగ్రస్తులు కొన్ని పళ్లకు దూరంగా ఉండాలి. ఎక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్, తక్కువ ఫైబర్ ఉన్న పళ్లను డయాబెటిక్ పేషెంట్లు తీసుకోకూడదు.

వేసవిలో పుచ్చకాయ తినేందుకు అందరూ ఇష్టపడతారు. అయితే పుచ్చకాయ గ్లైసెమిక్ ఇండెక్స్ 72-80 మధ్యలో ఉంటుంది. అందువల్ల పుచ్చకాయ తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. 

అరటి పండు పండిన స్థితిని బట్టి వాటి గ్లైసెమిక్ ఇండెక్స్ 42-62 మధ్యలో ఉంటుంది. అరటి పండు ఒకటి కంటే ఎక్కువ తినకూడదు. 

పైనాపిల్‌లో కూడా షుగర్ కంటెంట్ ఎక్కువ. దాని గ్లైసెమిక్ ఇండెక్స్ 50-66 మధ్యలో ఉంటుంది. 

మామిడి పళ్లలో ఎక్కువ మోతాదులో సుక్రోజ్, ఫ్రక్టోజ్ ఉంటాయి. గ్లైసెమిక్ ఇండెక్స్ 51-60 మధ్యలో ఉంటుంది.

ద్రాక్ష పళ్ల గ్లైసెమిక్ ఇండెక్స్ 46-53 మధ్యలో ఉంటుంది. అయితే వాటి సైజ్ కారణంగా చాలా మంది వాటిని ఎక్కువ మొత్తంలో తినేస్తుంటారు. అది ప్రమాదకరం. 

చెర్రీ పళ్లు పండిన స్థితిని బట్టి 20-63 గ్లైసెమిక్ ఇండెక్స్‌ను కలిగి ఉంటాయి. వీటిని షుగర్ వ్యాధిగ్రస్తులు ఎక్కువ మొత్తంలో తీసుకోకూడదు. 

ఎండు ద్రాక్ష గ్లైసెమిక్ ఇండెక్స్ 43-64 మధ్యలో ఉంటుంది. వీటికి కూడా షుగర్ వ్యాధిగ్రస్తులు దూరంగా ఉండాలి. 

డయాబెటిక్ రోగులు తినాల్సిన పళ్లు: ఆపిల్, బత్తాయి, నారింజ, పీర్స్, కివీ, బెర్రీస్ మొదలైనవి తినవచ్చు.