రెగ్యులర్ vs డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్..వీటిలో ఏది బెటర్

ప్రజలు కాస్త రిస్క్ ఉన్నప్పటికీ అధిక రాబడినిచ్చే మ్యూచువల్‌ ఫండ్ల వైపు మొగ్గుచూపుతున్నారు

మ్యూచువల్‌ ఫండ్లలో 2 ఆప్షన్లు ఉంటాయి. ఒకటి డైరెక్ట్‌, మరోటి రెగ్యులర్‌ మ్యూచువల్ ఫండ్‌

అయితే వీటిలో ఎందులో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అనేది ఇప్పుడు చుద్దాం

రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్‌లో మధ్యవర్తి ద్వారా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది

ఈ ప్లాన్‌లను మధ్యవర్తులే విక్రయిస్తారు. ఫండ్ హౌస్‌లు వారికి కమీషన్లు చెల్లిస్తుంటాయి

దీంతో రెగ్యులర్‌ ప్లాన్లలో వ్యయ నిష్పత్తి అనేది ఎక్కువగా ఉంటుంది 

డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఎలాంటి మధ్యవర్తులు ఉండరు

నేరుగా ఫండ్‌ హౌస్‌లు అందించే ప్లాన్లలో ఇన్వెస్ట్‌ చేయాలి

మధ్యవర్తులు లేనందున కమీషన్లు చెల్లించాల్సిన అవసరం లేదు, వ్యయ నిష్పత్తి తక్కువగా ఉంటుంది

ఈ రెండింటిలో ఏది ఎంచుకోవాలనేది ఇన్వెస్టర్లపై ఆధారపడి ఉంటుంది

పెట్టుబడి నిర్ణయాలు తీసుకునేందుకు ఆర్థిక సలహాదారుల సపోర్ట్ కావాలనుకుంటే రెగ్యులర్ ఫండ్స్ బెటర్

తక్కువ ఖర్చు, అధిక రాబడి కోరుకునేవారు డైరెక్ట్‌ ప్లాన్లు ఎంచుకోవచ్చు. కానీ సొంతంగా మార్కెట్‌ను అంచనా వేసే సామర్థ్యం ఉండాలి