ఇల్లు కొనే ముందు వీటి గురించి పక్కా తెలుసుకోండి

ఇల్లు కొనుగోలు చేయాలని ప్రతి ఒక్కరు భావిస్తారు. కానీ అంత ఈజీ అయితే కాదు

మధ్యతరగతి వ్యక్తులు అనేక విధాలుగా పొదుపు చేసి ఇల్లు కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతారు

ఈ నేపథ్యంలో ఇల్లు కొనుగోలు చేసే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ చుద్దాం

ముందుగా ఇల్లు కొనేందుకు ఆఫీస్, ఇంటికి దగ్గరలో ఉండే సరైన ప్రదేశాన్ని ఎంచుకోవాలి

డీల్‌ ఖరారు చేసుకోవడానికి ముందు ఆ ప్రాంతంలోని వ్యక్తులను కలవండి. ఆస్తుల రేట్ల గురించి తెలుసుకోండి

ఏజెంట్ ద్వారా ఇల్లు కొనుగోలు చేస్తే వారు ఒకటి నుంచి రెండు శాతం కమీషన్ తీసుకుంటారు

కాబట్టి డెవలపర్, కొనుగోలుదారు మధ్య ఏజెంట్ లేకుంటే కమీషన్ సేవ్ చేసుకోవచ్చు

మీరు రుణం తీసుకుని ఇళ్లు కొనుగోలు చేస్తే వడ్డీ రేట్ల గురించి కూడా తెలుసుకోవాలి

లోన్ ద్వారా ఇల్లు తీసుకోవాలని భావిస్తే డౌన్ పేమెంట్ చేసేందుకు మీ వద్ద 30 శాతం డబ్బు ఉండాలి

పండుగల సీజన్ సహా ఆఫర్లు ఉన్నప్పుడు కొనుగోలు చేస్తే తక్కువ ధరకు వచ్చే అవకాశం ఉంటుంది

మీరు ఇల్లు కొనే సమయంలో మీకు తెలిన వ్యక్తులు కూడా ఒకే దగ్గర కొనుగోలు చేస్తే తగ్గింపును పొందవచ్చు