Home » Hero Vijay
రాష్ట్ర అసెంబ్లీకి 2026లో జరుగనున్న ఎన్నికల్లో భావసారూప్యత కలిగిన పార్టీలతో చేతులు కలిపేందుకు తమిళగ వెట్రి కళగం (టీవీకే) సిద్ధమైంది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత విజయ్(Vijay) నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అగ్రనటుడిగా రాణిస్తున్న విజయ్ ప్రారంభించిన టీవీకే తొలి మహానాడు ఇటీవల విల్లుపురం జిల్లా విక్రవాండిలో విజయవంతంగా జరిగిన విషయం తెలిసిందే.
రాష్ట్రంలో కొత్తగా రాజకీయ పార్టీలు ప్రారంభించేవారంతా డీఎంకే నాశనాన్ని కోరుకుంటున్నారని, వారికి నాలుగేళ్ల ద్రావిడ తరహా పాలనలో అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలు గురించి తెలియకపోవడం శోచనీయమని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) టీఎంకే నేత విజయ్పై పరోక్షంగా ధ్వజమెత్తారు.
నటుడు విజయ్(Actor Vijay) రాజకీయాల్లోకి రావడం ఆశ్చర్యంగా ఉందని నటి రాధిక(Radhika) అభిప్రాయపడ్డారు. కోవై మక్కల్ సేవా కేంద్రం ఆధ్వర్యంలో కోవైలోని గుజరాత్ సమాజంలో సోమవారం దీపావళి బహుమతుల పంపిణీ కార్యక్రమం జరిగింది. బీజేపీ ఎమ్మెల్యే వానతి శ్రీనివాసన్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో నటి రాధిక పాల్గొని 150 మంది బాలికలకు దీపావళి కానుకలు అందజేశారు.
విక్రవాండి వద్ద నిర్వహించిన తొట్టతొలి మహానాడు విజయవంతం కావటంతో రెట్టింపు ఉత్సాహంతో తమిళగ వెట్రి కళగం నేత, సినీ హీరో విజయ్(Movie hero Vijay) త్వరలో రాష్ట్ర వ్యాప్త పర్యటనకు సిద్ధమవుతున్నారు. మహానాడు విజయవంతమయ్యేందుకు కృషిచేసిన పార్టీ నేతలందరికీ ఆయన ధన్యవాదాలు తెలుపుతూ మంగళవారం ఓ లేఖ రాశారు. మాజీ ముఖ్యమంత్రి అన్నాదురైలా తాను పార్టీ శ్రేణులకు తరచూ లేఖలు రాసి వారిలో ఉత్సాహాన్ని నింపాలని నిర్ణయించుకున్నానని విజయ్ పేర్కొన్నారు.
తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ తమిళ హీరో విజయ్ ఆదివారం విళుపురం జిల్లా విక్రవాండి సమీపంలోని వి.సాలైలో మొదటి రాష్ట్ర మహానాడును నిర్వహించారు. ఈ సందర్బంగా హీరో విజయ్ మాట్లాడుతూ...2026లో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయన్నారు. ఈ ఎన్నికల్లో తమను భారీ మెజార్టీతో గెలిపిస్తారని ప్రజలపై తమకు అచంచలమైన విశ్వాసం ఉందన్నారు. ఈ సందర్బంగా డీఏంకే, బీజేపీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
అగ్రహీరో విజయ్(Hero Vijay) సారథ్యంలోని తమిళగ వెట్రి కళగం (టీవీఏ) తొలి మహానాడుకు సర్వంసిద్ధమయ్యాయి. మహానాడు ప్రారంభోత్సవానికి ముందు పార్టీ అధినేత విజయ్ 101 అడుగుల స్తంభానికి పార్టీ జెండా ఆవిష్కరించనున్నారు. ఈ మహానాడు ప్రాంగణంలో అనేక మహనీయుల కటౌట్లను ఏర్పాటు చేశారు. ఇందులో ఇద్దరు మహిళా స్వాతంత్య్ర సమరయోధులకు కూడా స్థానం కల్పించారు.
పేరు ప్రఖ్యాతుల కోసమో, కాలయాపన కోసమో తాను రాజకీయప్రవేశం చేయలేదని ప్రజలతో మమేకమై వారికి సేవ చేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చానని తమిళగ వెట్రికళగం (టీవీకే) నేత, నటుడు విజయ్(Actor Vijay) పేర్కొన్నారు.
ప్రముఖ సినీ నటుడు విజయ్(Movie actor Vijay) ప్రారంభించిన తమిళగ వెట్రికళగం (టీవీకే) పతాకంలో ఏనుగు బొమ్మలకు తామెలాంటి అభ్యంతరాలు తెలుపలేమంటూ కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు బీఎస్పీ(BSP) అధిష్టానానికి లేఖ రాసింది.
విల్లుపురం జిల్లా విక్రవాండిలో అక్టోబరు 27న నిర్వహించనున్న తమిళగ వెట్రి కళగం (టీవీకే) మహానాడును విజయవంతం చేయాలని, ఎట్టి పరిస్థితుల్లో మద్యం సేవించి మహానాడులో పాల్గొనరాదని ఆ పార్టీ వ్యవస్థాపకుడు, సినీ నటుడు విజయ్(Movie actor Vijay) సూచించారు.
సినీనటుడు విజయ్(Actor Vijay) నాయకత్వంలోని తమిళగ వెట్రి కళగం(టీవీకే) తొలి మహానాడు అక్టోబర్ మూడో వారంలో నిర్వహించనున్నట్లు తెలిసింది. ఈ నెల 23న విక్రవాండిలో ఈ మహానాడును నిర్వహించేందుకు పోలీసుల అనుమతి లభించినప్పటికీ ఆ మహానాడు నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు చేపట్టలేదు.