Home » Aranii Srenevasulu
Andhrapradesh: కూటమి అభ్యర్థికి మద్దతుగా రోడ్ షోలో పాల్గొనేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా తిరుపతికి చేరుకున్నారు. తిరుపతిలో నిర్వహించే రోడ్ షోలో పాల్గొనేందుకు జేపీ నడ్డా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇప్పటికే జ్యోతిరావు పూలే విగ్రహం వద్దకు చేరుకున్నారు. అనంతరం జేపీ నడ్డాతో కలిసి లోకేష్ రోడ్ షో నిర్వహించారు. జనసేన ఉమ్మడి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ప్రచారం కోసం ప్రత్యేక విమానంలో లోకేష్ తిరుపతికి వచ్చారు.
తాము ప్రచారం చేసే సమయంలో వైసీపీ (YSRCP) నేతలు తమకు అడ్డుతగిలి అరాచకాలు సృష్టిస్తున్నారని జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు (Arani Srinivasulu) అన్నారు. తమ ప్రచారం సందర్భంగా గిరిపురంలో తమపై దాడి జరిగినా పోలీసులు చర్యలు తీసుకోక పోవటం, వైసీపీ వారం రోజులుగా తమ ప్రచారంలో అరాచకాలు సృష్టించటంపై తిరుపతి ఎస్పీకి శ్రీనివాసులు ఫిర్యాదు చేశారు.
తెలుగుదేశం - జనసేన - బీజేపీ కూటమి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసుల (Aranii Srenevasulu)పై వైసీపీ (YSRCP) నేతలు దాడికి పాల్పడ్డారు. శనివారం నాడు గిరిపురంలో శ్రీనివాసులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన ప్రచారం చేస్తుండగా వైసీపీ నాయకులు పోటీగా ప్రచారం చేశారు.
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ దాదాపు 18 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇక మిగిలినవి 3 స్థానాలు మాత్రమే.
Andhrapradesh: జనసేన అభ్యర్థిగా చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అభ్యర్థిత్వంపై తీవ్రమైన వ్యతిరేకత వస్తున్న విషయం తెలిసిందే. తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులును తిరుపతి టీడీపీ నేతలు అంగీకరించని పరిస్థితి. జనసేనలోనూ పలువురు ఆరణికి మద్దతు ఇచ్చేందుకు విముఖ వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో శ్రీనివాసులు అభ్యర్థిత్వంపై వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో తిరుపతి సీటు విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.
Andhrapradesh: తిరుపతి వాసులకు సేవ చేసేందుకు ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు అవకాశం ఇవ్వడం సంతోషంగా ఉందని జనసేన- టీడీపీ - బీజేపీ అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవారి పాదాల చెంత కార్యాలయాన్ని ప్రారంభించుకున్నామన్నారు. 24గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు.
Andhrapradesh: ‘‘పవన్ కల్యాణ్ మాట వేదం. తిరుపతి అభ్యర్థిని నేనే’’ అని జనసేన పార్టీ తిరుపతి అసెంబ్లీ అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం కపిలేశ్వర ఆలయంలో ఆరణి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పవన్‌తో చాలా సమయం మాట్లాడానని... ప్రతి మాట ఎంతో ఆలోచింపజేశాయని.. ఆయన లక్ష్యాలను సాధించేందుకు కృషి చేస్తానని తెలిపారు. తిరుపతిలో అనేక మంది బంధువులున్నారని... వ్యాపారులున్నాయన్నారు.
Andhrapradesh: రాష్ట్రంలో వైసీపీని, చిత్తూరులో వైసీపీ అభ్యర్థి విజయానంద రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. బడా ఎర్రచందనం స్మగ్లర్ విజయానంద రెడ్డి అంటూ వ్యాఖ్యలు చేశారు. చిత్తూరులో గుట్కా ,పేకాట, లాటరీ, ఇసుక ఇలా అన్ని రకాల అక్రమ కార్యకలాపాలను పెంచి పోషించిన వ్యక్తి విజయానంద రెడ్డి అని అన్నారు.
Andhrapradesh: బలిజ కులస్తులంటే సీఎం జగన్ మోహన్ రెడ్డికి గిట్టదని చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. రెడ్డి కుల నేతలు వైసీపీని ఏడాది క్రితమే వదిలినా సస్పెండ్ చేయలేదన్నారు. కేవలం బలిజ వర్గానికి చెందిన వ్యక్తినని తనపై చిన్నచూపని విమర్శించారు.
Andhrapradesh: తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జనసేన పార్టీలో చేరారు. గురువారం మంగళగిరి జనసేన కార్యాలయంలో ఎమ్మెల్యే శ్రీనివాసులకు అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఎమ్మెల్యేతో పాటు మరికొంతమంది వైసీపీ కార్పొరేటర్లు జనసేనలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఏపీకి దశ దిశ చూపించే సత్తా ఉన్న నేత పవన్ కళ్యాణ్ అని అన్నారు. ఇటీవలే తాను తొలిసారిగా పవన్ కళ్యాణ్‌ను కలిశానని.. ఆయనతో మాట్లాడిన తరువాత ప్రజల కోసం పరితపించే పవన్ కనిపించారన్నారు.