Share News

ప్రభాకర్‌రావుపై లుక్‌అవుట్‌ నోటీసు

ABN , Publish Date - Apr 27 , 2024 | 05:25 AM

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తులో భాగంగా మాజీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ప్రభాకర్‌ రావును భారత్‌కు రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సీపీ కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు.

ప్రభాకర్‌రావుపై లుక్‌అవుట్‌ నోటీసు

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి):

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తులో భాగంగా మాజీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ప్రభాకర్‌ రావును భారత్‌కు రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సీపీ కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు.

విదేశాల్లో ఉన్న ప్రభాకర్‌రావుపై ఇప్పటికే లుక్‌అవుట్‌ నోటీసు జారీ చేశామని, రెడ్‌ కార్నర్‌ నోటీసు ఇచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు.

కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా జరుగుతోందని తెలిపారు. దర్యాప్తు ఓ కొలిక్కి వచ్చిన తర్వాత అన్ని విషయాలు మీడియాకు వివరిస్తామన్నారు.

ప్రభాకర్‌ రావుపై రెడ్‌ కార్నర్‌ నోటీసు ఇచ్చేందుకు తాము ప్రయత్నిస్తున్న తరుణంలోనే రెడ్‌ కార్నర్‌ నోటీసు జారీ అయినట్టుగా ప్రచారం జరుగుతుండటం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి వార్తలు దర్యాప్తుపై ప్రభావం చూపుతాయన్నారు.

Updated Date - Apr 27 , 2024 | 10:02 AM