Share News

Telangana: విషాదం.. అత్తింటి వేధింపులు తాళలేక.. ఆల్ అవుట్ లిక్విడ్ తాగి..

ABN , Publish Date - Apr 20 , 2024 | 03:36 PM

పుట్టింటి నుంచి ఎంతో సంతోషంగా అత్తారింటికి పయనమైంది ఆ ఇల్లాలు. భర్త తన పట్ల చూపే ప్రేమానురాగాలకు ఎంతో మురిసిపోయింది. వీరి అన్యోన్య దాంపత్యాన్ని చూసి విధికి కన్ను కుట్టింది. సంతోషంగా సాగిపోతున్న వారి జీవితంలో ఆనందమే లేకుండా చేసింది.

Telangana: విషాదం.. అత్తింటి వేధింపులు తాళలేక.. ఆల్ అవుట్ లిక్విడ్ తాగి..

పుట్టింటి నుంచి ఎంతో సంతోషంగా అత్తారింటికి పయనమైంది ఆ ఇల్లాలు. భర్త తన పట్ల చూపే ప్రేమానురాగాలకు ఎంతో మురిసిపోయింది. వీరి అన్యోన్య దాంపత్యాన్ని చూసి విధికి కన్ను కుట్టింది. సంతోషంగా సాగిపోతున్న వారి జీవితంలో ఆనందమే లేకుండా చేసింది. కట్టుకున్న వాడు కడ దాకా తోడుంటాడనుకుంటే ట్రైన్ యాక్సిడెంట్ రూపంలో మృత్యువు కబళించింది. అత్తింటివారు ఆదుకుంటారనే భరోసాతో భర్త జ్ఞాపకాలతో కాలం గడిపేసింది. కానీ కాలం అంతటా ఒకేలా ఉండదు కదా.. అత్తారింట్లోనూ ఆమెకు వేధింపులు ప్రారంభమయ్యయాయి. వారి సూటిపోటీ మాటలతో మానసికంగా కుంగిపోయింది. పుట్టింటికి వెళ్లలేక, అత్తింట్లో ఉండలేక అను క్షణం నరకం అనుభవించింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు ( Crime News ) పాల్పడింది.


Supreme Court: పిల్లలతో పోర్న్ వీడియోలు చేయడం తీవ్ర నేరమే.. సుప్రీంకోర్టు

ఖమ్మం జిల్లాకు చెందిన రచనకు అదే జిల్లాకు చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. కొన్నాళ్లు వీరి దాంపత్యం సజావుగా సాగింది. ఆనందంగా సాగిపోతున్న సమయంలో భర్త ఓ రైలు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ క్రమంలో తన భర్త మృతి చెందిన నాటి నుంచి అత్తామామల వేధింపులు ప్రారంభమయ్యాయి. ఆ వేధింపులను తాళలేక రచన తీవ్ర మనస్తాపానికి గురై ఆల్ అవుట్ లిక్విడ్ తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో వారు వచ్చి చూసే సరికి అపస్మారక స్థితిలో పడి ఉండడంతో వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడి చికిత్స పొందుతూ రచన ప్రాణాలు విడిచింది.


Manish Sisodia: సాక్ష్యాలను తారుమారు చేయవచ్చు.. మనీష్ సిసోడియా బెయిల్ పై సీబీఐ కామెంట్స్..

ఆత్మహత్యకు ముందు మృతురాలు సూసైడ్ నోట్ రాసింది. తనపై అత్తామామలు లేనిపోని ఆరోపణల చేసి వేధిస్తున్నారని సూసైడ్ నోట్ లో తెలిపింది. భర్త చనిపోయిన తర్వాత తనను ఇంట్లోకి రానివ్వడం లేదని గతంలోనే బోనకల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం కొసమెరుపు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 20 , 2024 | 03:36 PM