Share News

T20 World Cup: మీడియా సమావేశం నుంచి నేరుగా రింకూ సింగ్ దగ్గరికి వెళ్లిన కెప్టెన్ రోహిత్ శర్మ

ABN , Publish Date - May 03 , 2024 | 12:32 PM

అందరి అంచనాలకు భిన్నంగా టీ20 వరల్డ్ కప్ 2024 ఆడబోయే భారత జట్టులో యువ సంచలన రింకూ సింగ్‌కి చోటు దక్కలేదు. దీంతో బీసీసీఐ సెలక్షన్ కమిటీపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం అందరినీ ఆకట్టుకునేలా, రింకూ సింగ్‌కి ఓదార్పునిచ్చేలా వ్యవహరించాడు. భారత జట్టు ఎంపికను సమర్థిస్తూ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, కెప్టెన్ రోహిత్ శర్మ ఇద్దరూ నిన్న (గురువారం) ముంబైలో మీడియా సమావేశం నిర్వహించారు.

T20 World Cup: మీడియా సమావేశం నుంచి నేరుగా రింకూ సింగ్ దగ్గరికి వెళ్లిన కెప్టెన్ రోహిత్ శర్మ

అందరి అంచనాలకు భిన్నంగా టీ20 వరల్డ్ కప్ 2024 ఆడబోయే భారత జట్టులో యువ సంచలన రింకూ సింగ్‌కి చోటు దక్కలేదు. దీంతో బీసీసీఐ సెలక్షన్ కమిటీపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం అందరినీ ఆకట్టుకునేలా, రింకూ సింగ్‌కి ఓదార్పునిచ్చేలా వ్యవహరించాడు. భారత జట్టు ఎంపికను సమర్థిస్తూ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, కెప్టెన్ రోహిత్ శర్మ ఇద్దరూ నిన్న (గురువారం) ముంబైలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ముగిసిన వెంటనే ప్రస్తుతం రోహిత్ శర్మ ముంబైలోని వాంఖడే స్టేడియానికి వెళ్లాడు. ముంబై ఇండియన్స్‌తో తలపడేందుకు కోల్‌కతా నైట్ రైడర్స్‌ జట్టు మైదానంలో ఉండడంతో రోహిత్ నేరుగా వెళ్లి రింకూ సింగ్‌ని కలిశాడు. వారిద్దరు కొద్దిసేపు మాట్లాడుకోవడం కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ జట్టు ఎక్స్ వేదికగా షేర్ చేసింది.


ఈ వీడియో రోహిత్‌ని చూసిన రింకూ సింగ్ ముఖంలో నవ్వు కనిపించింది.. కానీ ఆవేదన, బాధ అతడిలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొద్దిసేపు సీరియస్ చర్చలు చేస్తున్నట్టుగా కనిపించారు. రింకూని ఓదార్చుతున్నట్టుగా రోహిత్ కనిపించారు. వీరిద్దరి కలయికను మైదానంలో ఉన్నవారంతా ఆసక్తిగా గమనించారు. మైదానంలోని అందరి ముఖాల్లోనూ నవ్వు కనిపించింది. మొత్తంగా రింకూ సింగ్‌ని ఈ విధంగా కలవడం ద్వారా రోహిత్ శర్మ సానుకూల సంకేతాలు ఇచ్చాడని క్రికెట్ ఫ్యాన్స్ మెచ్చుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కాగా టీ20 వరల్డ్ కప్ కోసం 15 మంది సభ్యుల జట్టులోకి రింకూ సింగ్, శుభ్‌మాన్ గిల్‌లను తీసుకోకపోవడం ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో అగార్కర్, రోహిత్ శర్మ గురువారం వివరణ కూడా ఇచ్చారు.


కాగా రింకూ సింగ్ తన టీ20 కెరియర్‌లో 15 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అతడి 89 సగటు, 176.24 స్ట్రైక్ రేటుతో ఇప్పటివరకు 356 పరుగులు చేశాడు. రింకూకి చోటు దక్కకపోవడంపై అజిత్ అగార్కర్ స్పందిస్తూ.. రింకూ ఎలాంటి తప్పూ చేయలేదని, జట్టులో అదనపు బౌలర్ కోసం కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించారు. ఈ నిర్ణయం దురదృష్టకరం అని, అయితే నిర్ణయం తీసుకోక తప్పలేదని వివరించారు. కాగా రింకూ సింగ్‌కి 15 మంది సభ్యుల జట్టులో చోటు దక్కకపోయినప్పటికీ రిజర్వ్ ప్లేయర్‌గా అతడు జట్టులోనే ఉండనున్నాడు.

Updated Date - May 03 , 2024 | 12:33 PM