Share News

KKR Vs LSG: కోల్‌కతా వర్సెస్ లక్నో మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే?

ABN , Publish Date - Apr 14 , 2024 | 03:07 PM

కోల్‌కతా: ఐపీఎల్ 2024లో మరో ఆసక్తికర పోరుకు తెరలేచింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ప్రత్యర్థి జట్టుకి బ్యాటింగ్ అప్పగించాడు.

 KKR Vs LSG: కోల్‌కతా వర్సెస్ లక్నో మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే?

కోల్‌కతా: ఐపీఎల్ 2024లో మరో ఆసక్తికర పోరుకు తెరలేచింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ప్రత్యర్థి జట్టుకి బ్యాటింగ్ అప్పగించాడు.

తుది జట్లు..

లక్నో సూపర్ జెయింట్స్: క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్/కెప్టెన్), దీపక్ హుడా, ఆయుష్ బదోని, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, షమర్ జోసెఫ్, యశ్ ఠాకూర్.

కోల్‌కతా నైట్ రైడర్స్ : ఫిలిప్ సాల్ట్(వికెట్ కీపర్), సునీల్ నరైన్, వెంకటేశ్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), రఘువంశీ, ఆండ్య్రూ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి.

టాస్ సమయంలో కేఎల్ రాహుల్ మాట్లాడుతూ.. టాస్ గెలిచివుంటే తాము కూడా బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని అన్నాడు. పిచ్‌పై టర్న్ లభించే అవకాశం ఉందని పేర్కొన్నాడు. ఇక ఈ మ్యాచ్ పలు మార్పులు చేశామని తెలిపారు. పడిక్కల్, నవీన్-ఉల్-హక్ పక్కన పెట్టగా వారి స్థానంలో షమర్ జోసెఫ్. దీపక్ హుడా తిరిగి జట్టులోకి వచ్చాడరని కేఎల్ రాహుల్ చెప్పాడు. ఇక మొహ్సిన్ ఖాన్ కూడా నేటి మ్యాచ్‌లో ఆడతాడని వివరించాడు.

కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మాట్లాడుతూ.. ఫస్ట్ బౌలింగ్ చేస్తాడని అన్నాడు. తిరిగి కోల్‌కతాలో మ్యాచ్ ఆడుతుండడం తమకు ఎంతో సంతోషంగా ఉందన్నాడు. కోల్‌కతా ఫ్యాన్స్ చాలా ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నారని, కోల్‌కతా వెలుపల మ్యాచ్‌లు ఆడేటప్పుడు ఈ జోష్‌ని మిస్సవుతుంటామని చెప్పాడు. ఫస్ట్ బౌలింగ్ కాబట్టి రింకూ సింగ్ బయట ఉంటాడని, హర్షిత్ రాణా బౌలింగ్‌కు వస్తాడని వెల్లడించాడు.

Updated Date - Apr 14 , 2024 | 03:24 PM