Share News

KKR vs LSG: కోల్‌కతా ఖాతాలో మరో విజయం.. లక్నో చిత్తు

ABN , Publish Date - Apr 14 , 2024 | 07:21 PM

ఐపీఎల్ 2024లో (IPL 2024) కోల్‌కతా నైట్ రైడర్స్ మరో విజయాన్ని సాధించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ని చిత్తుగా ఓడించింది. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ 89 పరుగులతో చెలరేగడంతో 162 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోవడంతో 8 వికెట్ల తేడాతో విజయాన్ని ఖాతాలో వేసుకుంది.

KKR vs LSG: కోల్‌కతా ఖాతాలో మరో విజయం.. లక్నో చిత్తు

కోల్‌కతా: ఐపీఎల్ 2024లో (IPL 2024) కోల్‌కతా నైట్ రైడర్స్ మరో విజయాన్ని సాధించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ని చిత్తుగా ఓడించింది. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ 89 పరుగులతో చెలరేగడంతో 162 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోవడంతో 8 వికెట్ల తేడాతో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. కోల్‌కతా బ్యాటర్లలో ఫిలిప్ సాల్ట్ (89 నాటౌట్), సునీల్ నరైన్ (6), రఘువంశీ (7), శ్రేయస్ అయ్యర్ (38) చొప్పున పరుగులు కొట్టారు. దీంతో 15.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. ఇక లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో కోల్‌కతా కోల్పోయిన 2 వికెట్లు మోహ్సిన్ ఖాన్‌కు పడ్డాయి.


అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్‌ బ్యాటర్లు మరోసారి విఫలమయ్యారు. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు మాత్రమే చేయగలిగారు. లక్నో బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (39), ఆయుశ్ బదోనీ (29), నికోలస్ పూరన్ (45) మాత్రమే ఫర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లు స్వల్ప స్కోర్లకే పెవిలీయన్ చేరారు. ఓపెనర్ క్వింటన్ డికాక్ (10), దీపక్ హుడా (8), మార్కస్ స్టోయినిస్ (10), కృనాల్ పాండ్యా (7 నాటౌట్), అర్షద్ ఖాన్ (5) స్వల్ప స్కోర్లకే ఔటయ్యారు. కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3 కీలక వికెట్లు లక్నోని కోలుకోలేని దెబ్బకొట్టాడు. వైభవ్ ఆరోరా, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తీ, ఆండ్ర్యూ రస్సెల్ తలో వికెట్ తీశారు.

Updated Date - Apr 14 , 2024 | 07:27 PM