Share News

CSK Vs SRH: మరోసారి రాణించిన రుతురాజ్ గైక్వాడ్.. సన్‌రైజర్స్ ముందు భారీ టార్గెట్

ABN , Publish Date - Apr 28 , 2024 | 09:37 PM

ఐపీఎల్ 2024లో ప్లే ఆఫ్ అవకాశాలను మరింత మెరుచుకోవడానికి కీలకమైన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు చెలరేగారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 54 బంతుల్లో 98 పరుగులు బాదడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి చెన్నై 212 పరుగులు చేసింది.

CSK Vs SRH: మరోసారి రాణించిన రుతురాజ్ గైక్వాడ్.. సన్‌రైజర్స్ ముందు భారీ టార్గెట్

చెన్నై: ఐపీఎల్ 2024లో ప్లే ఆఫ్ అవకాశాలను మరింత మెరుచుకోవడానికి కీలకమైన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు చెలరేగారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 54 బంతుల్లో 98 పరుగులు బాదడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి చెన్నై 212 పరుగులు చేసింది. దీంతో సన్‌రైజర్స్ విజయ లక్ష్యంగా 213 పరుగులుగా ఉంది.


గైక్వాడ్ 10 ఫోర్లు, 3 సిక్సర్లతో హైదరాబాద్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అయితే దురదృష్టవశాత్తూ తృటిలో సెంచరీని కోల్పోయాడు. డారిల్ మిచెల్ కూడా అదరగొట్టాడు. 32 బంతుల్లో 52 పరుగులు చేశాడు. ఇక చివరిలో శివమ్ దూబే (నాటౌట్) 20 బంతుల్లో 39 పరుగులు బాదాడు. అజింక్యా రహానే 9, ఎంఎస్ ధోనీ 5 (నాటౌట్) చొప్పున పరుగులు కొట్టారు.


ఇక సన్‌రైజన్స్ హైదరాబాద్ బౌలర్లు ఆరంభంలో చెన్నై బ్యాటర్లను బాగానే కట్టడి చేశారు. అయితే ఆ తర్వాత క్రమంగా పరుగులు సమర్పించుకున్నారు. భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్, జయ్‌దేవ్ ఉనద్కత్‌లు తలో వికెట్ మాత్రమే తీశారు.

Updated Date - Apr 28 , 2024 | 09:38 PM