Share News

Viral: ఒళ్లు గగుర్పాటుకు గురిచేసే వీడియో.. ఏం జరిగిందంటే..?

ABN , Publish Date - May 08 , 2024 | 11:26 AM

ఓ కారు ఫుట్ పాత్‌పైకి దూసుకొచ్చింది. కారు ఢీ కొనడంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం ఎక్కడ జరిగిందో తెలియదు. 11 సెకన్ల నిడివి గల వీడియో చూస్తే రోమాలు నిక్కపొడవడం ఖాయం. అటు వైపు నుంచి వస్తోన్న ఓ కారు సడెన్‌గా ఫుట్ పాత్‌పైకి దూసుకొచ్చింది. ఆ కారు స్పీడ్‌గా ఉండటంతో ఫుట్ పాత్ మీద ఉన్న నలుగురు ఎగిరిపడ్డారు.

Viral: ఒళ్లు గగుర్పాటుకు గురిచేసే వీడియో.. ఏం జరిగిందంటే..?
speeding car

కొన్ని సార్లు కళ్లు మూసి తెరిచేలోపు ప్రమాదాలు జరుగుతుంటాయి. రోడ్డు మీద వెళ్లేప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో ఫుట్ పాత్‌ మీద కూడా భద్రత ఉండటం లేదు. వేగంగా కార్లు దూసుకొస్తున్నాయి. తాజాగా ఓ కారు ఫుట్ పాత్‌పైకి దూసుకొచ్చింది. కారు ఢీ కొనడంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.


ప్రమాదం ఎక్కడ జరిగిందో తెలియదు. 11 సెకన్ల నిడివి గల వీడియో చూస్తే రోమాలు నిక్కపొడవడం ఖాయం. అటు వైపు నుంచి వస్తోన్న ఓ కారు సడెన్‌గా ఫుట్ పాత్‌పైకి దూసుకొచ్చింది. ఆ కారు స్పీడ్‌గా ఉండటంతో ఫుట్ పాత్ మీద ఉన్న నలుగురు ఎగిరిపడ్డారు. బ్లూ కలర్ షర్ట్ వేసుకున్న వ్యక్తి, ఓ శునకం మాత్రం బతుకు జీవుడా అని ప్రమాదం నుంచి బయటపడ్డారు.


ఆ కారు మంచి స్పీడ్‌‌లో ఉంది. ముందట ట్రాఫిక్ ఉండటంతో బస్సు, వెనకాల మరో కారు ఆగాయి. స్పీడ్‌గా ఉన్న కారు.. తన ముందట ఉన్న వాహనాలను తప్పించబోయి ఫుట్ పాత్‌పైకి దూసుకొచ్చాడు. కారు వేగంగా ఉండటంతో కంట్రోల్ తప్పింది. ఫుట్ పాత్ మీద ఎగిరి నలుగురిని ఢీ కొంది. ఆ ప్రమాద దృశ్యాలు చూస్తే ప్రతి ఒక్కరు భయ పడటం ఖాయం. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసి నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. భయాందోళన కలిగిస్తోందని ఒకరు, ఆ డ్రైవర్ మద్యం సేవించాడని మరొకరు రాశారు. డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఎక్కువ మంది కోరారు.

Updated Date - May 08 , 2024 | 11:26 AM