Share News

నీకెవరు చెప్పారు?

ABN , Publish Date - May 08 , 2024 | 12:13 AM

అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యంలో ఒక రాక్షస కొండ ఉండేది. దాని పేరు రాక్షస కొండ అని పిలుచుకునేవాళ్లు. ఎందుకంటే అక్కడ మృగాలు సంచరిం

నీకెవరు చెప్పారు?

నగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యంలో ఒక రాక్షస కొండ ఉండేది. దాని పేరు రాక్షస కొండ అని పిలుచుకునేవాళ్లు. ఎందుకంటే అక్కడ మృగాలు సంచరించేవి. దారి దొంగలు ఉండేవాళ్లు. ఎక్కువగా హత్యలు జరిగేవి. దాని దగ్గర ఒక చిన్న ఊరు ఉంది. ఆ ఊరిలో రాములమ్మ అనే ఆమె కూరగాయల వ్యాపారం చేసేది. ప్రతి రోజూ దగ్గరలోని పెద్ద ఊరుకు నడిచి వెళ్లేది. ఆమె కష్టాలకు కొదువలేదు. అయినా ఓపిగ్గా వ్యాపారం చేసుకుంటూ బతికేది.

ఆమె కొండ దాటి వెళ్లి పది కిలోమీటర్ల దూరంలో ఉండే పెద్ద ఊరికి వెళ్లేది. ఏనాడూ ఆమె ఇబ్బంది పడలేదు. పైగా నూకలు ఉన్నన్నాళ్లు ఇక్కడ ఉంటామనే తత్వం ఆమెది.

అందుకే ఆమె భయాన్ని లెక్కచేసేది కాదు. ఆ పెద్ద ఊరులో ఓ గుర్రపు రౌతు ఉండేవాడు. అతను పన్నులు వసూలు చేసేవ్యక్తి. అతనికి శిస్తు కట్టించటం తెలుసుకానీ.. ఇతరుల పట్ల అభిమానంగా ఉండటం రాదు. కరుకు మనిషి. పేరు శివాజీ. అతను గుర్రంమీద వెళ్తున్నప్పుడు దారిలో ఏమైనా విలువైన వస్తువులు కనపడితే.. రాజుగారి పేరు చెప్పి దర్జాగా తీసుకుని వెళ్లేవాడు. ఇసుమంతైనా సిగ్గు ఉండేది కాదు అతనికి.

ఒక రోజు కూరగాయలు అమ్ముకుని.. ఇంటి వంటకు సరిపడ వస్తువులను కొని సంచిలో సర్ది తన ఊరికి వెళ్తోంది రాములమ్మ. బరువు మోయలేకపోతోంది. కిందపడే పరిస్థితి. పైగా ఎండ. గుర్రం మీద వచ్చే రౌతును చూసి ‘అయ్యా.. ఈ సంచిని తీసుకెళ్లండి. మా ఊరిలో ఫలానా కొలిమి దగ్గర ఉండే రామయ్య ఇంటి దగ్గర ఉంచండి. తీసుకుంటా’ అన్నది.


ఆ రౌతు కోపంగా చూసి.. ‘ఇదేమైనా మీ నాయన సొమ్మా? ఈ గుర్రం నాది. పైగా రాజుగారి సేవకుడిని. రాజుగారి మనిషితో నువ్వు పని చేయించుకోవటం నేరం. అంటరాని దానవు’ అంటూ తిట్టి గుర్రాన్ని పరిగెత్తించాడు. సాయం చేయకపోగా తిట్టిన ఆ రౌతును చూసి రాములమ్మ కోప్పడింది. బాధతో సంచిని మోస్తూ బయలుదేరింది.

అరకిలోమీటరు వెళ్లాక రౌతుకు ఒక అనుమానం వచ్చింది. కొంపదీసి సంచిలో విలువైన వస్తువులు ఉన్నాయా? అనుకున్నాడు. వెంటనే గుర్రాన్ని వెనక్కి తిప్పి ఆ ముసలామె దగ్గరకు వెళ్లాడు. ‘ఈ సంచిని నువ్వు మోయలేవు.

నాకు ఇవ్వు నేను తీసుకెళతా’ అన్నాడు. ‘నేను ఇప్పుడు ఇవ్వను’ అన్నది రాములమ్మ. నేను తీసుకెళతా అన్నాడు ఆ రౌతు. కుదరదు అన్నది. ‘ఇంతలో ఇవ్వకూడదు అని నీకెవ్వరు చెప్పారు?’ అని అడిగాడు. ‘ఇంతలో నీకెందుకు నా సంచి మీద అభిమానం కలిగింది. నీకెవ్వరు చెప్పారు?’ అంటూ గట్టిగా అరిచింది. దగ్గరలో కొందరు ఊరి జనాలు కనపడ్డారు. దీంతో గుర్రాన్ని పరిగెత్తించాడు రౌతు.

Updated Date - May 08 , 2024 | 12:13 AM