Share News

మీకు తెలుసా?

ABN , Publish Date - May 04 , 2024 | 02:25 AM

ఎలుకలా ఉండే ఈ జంతువును ‘రాక్‌ హైరాక్స్‌’ అని పిలుస్తారు. ఈ జంతువును స్టోన్‌ బాడ్జర్‌, రాక్‌ రాబిట్‌ అంటూ పిలుస్తారు కొన్ని చోట్ల. రాళ్లలో ఉంటాయి కాబట్టి రాక్‌ హైరాక్స్‌ అని పిలుస్తారు. రాళ్ల తొర్రల్లో నివసిస్తాయి.

మీకు తెలుసా?

  • లుకలా ఉండే ఈ జంతువును ‘రాక్‌ హైరాక్స్‌’ అని పిలుస్తారు. ఈ జంతువును స్టోన్‌ బాడ్జర్‌, రాక్‌ రాబిట్‌ అంటూ పిలుస్తారు కొన్ని చోట్ల. రాళ్లలో ఉంటాయి కాబట్టి రాక్‌ హైరాక్స్‌ అని పిలుస్తారు. రాళ్ల తొర్రల్లో నివసిస్తాయి.

  • 54 సెం.మీ. పొడవు ఉంటాయి. రెండు కేజీల బరువు నుంచి ఐదు కేజీల వరకు ఉంటాయి. మగ జంతువులు పెద్దగా కనిపిస్తాయి.

  • గంటకు 30 కిమీ వేగంతో పరిగెత్తుతాయి.

  • ఆఫ్రికా, పశ్చిమ ఆసియాలో ఎక్కువగా ఈ జాతి కనపడుతుంది. ఒకచోట నుంచి మరో ప్రాంతానికి వెళ్లటానికి ఇష్టపడదు.

  • ఒకేసారి ఒకటి నుంచి ఆరు పిల్లలను కంటాయి. మూడు నెలల తర్వాత స్వతంత్రంగా జీవిస్తాయి.

  • ఆఫ్రికాలోని దక్షిణ దేశాలు, ఈజిప్టు ప్రాంతాల్లోని కొందరు ఈ జంతువును వేటాడి తింటారు. అందుకే ఆ ప్రాంతాల్లో వీటి సంఖ్య తగ్గిపోతోంది.

  • ఇవి ఎక్కువగా మధ్యాహ్నం వరకూ ఎండలో ఉండటానికి ఇష్టపడతాయి.

  • వీటి కడుపులో మూడు గదులు ఉంటాయి. వాటి పిల్లలు జీర్ణం చేసుకోలేకవని పచ్చికను నమిలి లోపల పెట్టుకుంటాయి. ఆ తిండి వాటి పిల్లలకు తినిపిస్తాయి.

  • 12 సంవత్సరాల వరకూ జీవిస్తాయి.

Updated Date - May 04 , 2024 | 02:25 AM